Janaki Kalaganaledu July 20 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో రామ జానకి చీట్ చేసినందుకు కాసేపు అలుగుతాడు. ఎందుకు ఇలా చేశారు అని రామ అడగటంతో వెంటనే జానకి వెళ్లి రామను హగ్ చేసుకుంటుంది. దాంతో రామ షాక్ అవుతాడు. జానకి మాట్లాడుతూ మీతో ఒంటరిగా గడపడానికి ఇలా చేశాను అని చెబుతుంది.
ఆ తర్వాత రామ తను షాప్ కి వెళ్తాను అని అనటంతో.. వెంటనే జానకి అత్తయ్య గారికి ఏం చెబుతావు అని ప్రశ్నిస్తుంది. అత్తయ్య గారు ఈరోజు మిమ్మల్ని నాతోనే ఉండమన్నారు అని అంటుంది. రామ మాత్రం జానకి చేస్తున్న చిలిపి చేష్టలకు భయపడి అక్కడి నుంచి ఎలాగైనా వెళ్లాలి అని ప్రయత్నిస్తాడు. కానీ జానకి పంపించకుండా చేస్తుంది.
సీన్ కట్ చేస్తే..
మల్లిక అరటి తొక్క పట్టుకొని జానకి అలా ఎలా పడింది అని.. ఏదో జరుగుతుంది అని ఆలోచిస్తుంది. వెళ్లి చూస్తేనే అసలు నిజం బయటపడుతుంది అని అనుకుంటుంది. ఇక జానకి దగ్గరికి రామ బుక్స్ తీసుకొని వచ్చి.. ఇవాళ ఎక్కడికి వెళ్ళను అని.. మీతో ఉంటూ ఇవాళ చదివిపిస్తాను అని అంటాడు. జానకి చదవడానికి ఏమాత్రం ఆసక్తి చూపించదు.
జానకి చదువుతున్న విషయాన్ని తెలుసుకున్న మల్లిక.. ఎలాగైనా ఈ విషయం పోలేరమ్మకు చెప్పాలి అని హడావిడిగా జ్ఞానంబ దగ్గరికి వెళ్తుంది. ఇక జ్ఞానంబ దంపతులు జానకికి అయిన గాయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మల్లిక అత్తయ్య గారు అత్తయ్య గారు అంటూ అరుచుకుంటూ వస్తుంది. ఇక జ్ఞానంబ చిరాకు పడి ఏంటి అని అడగటంతో..
మల్లిక పై అరిచిన జ్ఞానంబ..
జానకిని ఉద్దేశించి కొన్ని డైలాగులు కొడుతుంది. అసలు విషయం చెప్పమని అనడంతో.. జానకి పెద్ద పెద్ద పుస్తకాలు పట్టుకొని చదువుకుంటుంది అని చెప్పటంతో జ్ఞానంబ దంపతులు షాక్ అవుతారు. మొదట జ్ఞానంబ షాక్ అయినట్లు అనిపిస్తుంది. ఆ తర్వాత మల్లికను జానకి గురించి అలా అనొద్దు అని గట్టిగా తిడుతుంది.
కానీ మల్లిక మాత్రం ఎలాగైనా జానకి చదువు విషయం తెలిసేలా చేయాలి అని.. వాళ్లను అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఓవైపు జానకి మీరు నాకు హగ్ ఇస్తేనే నేను చదువుకుంటాను అని మారం చేస్తుంది. రామ మాత్రం చదువుకోండి అంటూ బ్రతిమాలుతూ ఉంటాడు. కానీ జానకి మొండికేయడంతో రామ జానకికి హగ్ ఇస్తాడు.
Janaki Kalaganaledu July 20 Today Episode: జానకి చదువుతున్న సీన్ జ్ఞానంబకు చూపించే ప్రయత్నం చేసిన మల్లిక..
ఇక మల్లిక తన అత్తయ్యకు జానకి అసలు రూపాన్ని చూపించడానికి గది దగ్గరికి రమ్మంటుంది. దాంతో జ్ఞానంబ మల్లికపై అరిచి మల్లికను అక్కడి నుంచి పంపిస్తుంది. ఆ తర్వాత మల్లిక మరోసారి ప్లాన్ చేసి.. జ్ఞానంబ దంపతులను గది దగ్గరికి తీసుకొని వెళ్తుంది. అక్కడికి వెళ్లి చూసేవారికి వారిద్దరూ హగ్ చేసుకుంటూ కనిపిస్తారు.
చదువుకోవడానికి వెళుతున్న జానకికి కంటపడిన జ్ఞానంబ..
ఆ తర్వాత మల్లికపై ఓ రేంజిలో ఫైర్ అవుతుంది జ్ఞానంబ. ఇక జానకి మళ్లీ చదవడం ప్రారంభించగా.. అది చూసి మల్లిక ఏం చేయలేక పోతుంది. ఇక జ్ఞానంబ మల్లికను అందరికీ వంట చేయమని చెబుతుంది. ఇక చీకటి పడటంతో చదువుకోడానికి జానకిను రామ తీసుకెళ్తుంటే వారికి జ్ఞానంబ ఎదురుపడుతుంది. రామ జానకి ఏవో కొనడానికి అబద్ధం చెబుతూ ఉండగా అప్పుడే మల్లిక ఎంట్రీ ఇస్తుంది.