Janaki Kalaganaledu July 25 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో గోవిందరాజులు జానకి సర్టిఫికెట్ కోసం జ్ఞానంబ బీరువా తాళం చెవిలు తీసుకొని వస్తాడు. ఇక ఈ తాళం తీసుకొని జానకి సర్టిఫికెట్లు తీసుకోమని రామకు చెబుతాడు. దాంతో జానకి, రామ షాక్ అవుతారు. ఇక వీరి మాటలన్నీ మల్లిక ఒకచోట ఉండి వింటుంది.
సర్టిఫికెట్లు దొంగతనం చేసి తీసుకోమన్న గోవిందరాజులు..
జానకి అలా సర్టిఫికెట్లు తీసుకోవడం సరి కాదేమో అని.. భవిష్యత్తులో ఈ విషయం గురించి తెలిస్తే అత్తయ్య గారు అసలు ఊరుకోరు అని.. అలా సర్టిఫికెట్లు దొంగతనం చేసుకొని తీసుకోవడం సరైనది కాదు మామయ్య అంటూ చెబుతూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న రామ కూడా అలా తీసుకోవడం కరెక్ట్ కాదు అని.. అమ్మని మోసం చేసినట్లు అవుతుంది అని అంటాడు.
జానకి దంపతులకు ధైర్యం ఇచ్చిన గోవిందరాజులు..
దాంతో గోవిందరాజులు మంచి పని కోసం దొంగతనం చేసిన తప్పు ఉండదు అని కొన్ని విలువైన మాటలు చెబుతాడు. ఏమి కాదు అని సర్టిఫికెట్లు తీసుకోమని ధైర్యం చెబుతాడు. నేను అమ్మను మాటల్లో పెట్టి బయటకు తీసుకొస్తాను అని.. నువ్వు నేరుగా వెళ్లి జానకి సర్టిఫికెట్లు తీసుకొని వెళ్ళండి అని.. తిరిగి వచ్చాక ఆ సర్టిఫికెట్లు అక్కడే పెడదాము అని వారి చేతిలో తాళం చెవులు పెట్టి అక్కడి నుంచి వెళ్తాడు గోవిందరాజులు.
ఇక జానకి దంపతులు ఏమి అనలేకుండా మౌనంగా ఉంటారు. ఇక మల్లిక మాత్రం ఏదో జరుగుతుంది.. వీరు ఏం చేస్తున్నారు అని వీరి రహస్యం వెనుక ఏదో జరుగుతుంది అని ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత గోవిందరాజులు జ్ఞానంబను మాటల్లో పెట్టి బయటికి తీసుకుని వస్తాడు. ఇక జ్ఞానంబ ను ఒకచోట కూర్చోబెట్టి రామ వాళ్ళ దగ్గరికి వచ్చి నేను వెళ్ళమన్నప్పుడు వెళ్ళండి అని చెప్పి జ్ఞానంబ కోసం గోరింటాకు తీసుకొని వస్తాడు.
మోసం చేస్తున్నానని బాధపడుతున్న రామ..
గోవిందరాజులు తన భార్యకు గోరింటాకు పెడుతూ ఉండగా రామను సర్టిఫికెట్లు తెచ్చుకోమని సైగ చేస్తాడు. ఇక ఇదంతా మల్లిక గమనిస్తూనే ఉంటుంది. ఇక రామ వెళ్లి సర్టిఫికెట్లు తీసుకుంటాడు. మంచి పని కోసం తన తల్లిని మోసం చేస్తున్నాను అని బాధపడతాడు. ఇక సర్టిఫికెట్ తీసుకొచ్చి జానకిని బయటికి తీసుకుని వెళ్తాడు.
Janaki Kalaganaledu July 25 Today Episode: కుట్ర చేయడానికి సిద్ధంగా ఉన్న మల్లిక..
ఇక జానకికి సర్టిఫికెట్లు ఇచ్చి అక్కడ నుంచి అకాడమీకి బయలుదేరుతారు. ఒక మల్లికకు అనుమానం రావడంతో వెంటనే తన తమ్ముడికి ఫోన్ చేసి వారిని ఫాలో అవ్వమని చెబుతుంది. వాళ్ళు అకాడమీ దగ్గరికి వెళ్ళగా జానకిని రామ ఇంకొకసారి సర్టిఫికెట్లు చెక్ చేసుకోమని చెబుతాడు. ఇక అవి సర్టిఫికెట్లు అని వెంటనే మల్లిక తమ్ముడికి తెలుస్తుంది. ఆ తర్వాత జానకి సర్టిఫికెట్లు ఇవ్వడానికి లోపలికి వెళుతుంది. రామ బయట ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక మల్లికకు తన తమ్ముడు ఫోన్ చేసి అసలు విషయం చెప్పాలి అని అనుకుంటాడు. దీనిని బట్టి చూస్తే మల్లిక ఏదో కుట్ర చేస్తున్నట్లు అర్థమవుతుంది.