Janaki Kalaganaledu July 26 Today Episode: ఈ రోజు ఎపిసోడ్ లో మల్లిక వాళ్ళ తమ్ముడు మల్లికకు ఫోన్ చేయగా మల్లిక తెగ ఆగకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. ఆ తర్వాత అతను జానకి సర్టిఫికెట్లు ఇవ్వడానికి వచ్చింది అని చెబుతాడు. ఇంతకు ఆ సర్టిఫికెట్లు ఏంటి అనడంతో ఐఏఎస్, ఐపీఎస్ చదువుకునే వాళ్ళ సర్టిఫికెట్లు అని చెప్పటంతో మల్లిక నోరు తెరిచి షాక్ అవుతుంది. దాంతో వెంటనే వాళ్ళ తమ్ముడు ఏం చెప్పింది వినకుండా ఫోన్ కట్ చేస్తుంది
జ్ఞానంబకు నిజం చెప్పేసిన మల్లిక..
ఇక మల్లిక ఎలాగైనా ఈ విషయం తన అత్తయ్య గారికి చెప్పాలి అని జానకి పని చేయాలి అని ఫిక్స్ అవుతుంది. దాంతో వెంటనే తాను జ్ఞానంబ దగ్గరికి వెళ్లి అసలు విషయం చెబుతుంది. అంతేకాకుండా జానకి సర్టిఫికెట్లు మీ బీరువాలో కూడా ఉండవని కావాలంటే ఒకసారి చూడండి అని గట్టిగా అంటుంది. పక్కనే ఉన్న గోవిందరాజులు ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
భయంతో గోవిందరాజులు..
కాసేపు తోటి కోడలు గురించి చాడీలు చెప్పడం ఆపుతావా అని అంటుంటాడు. కానీ లోలోపల నిజం తెలిసిపోతుందని భయపడుతూ ఉంటాడు. మొదట జ్ఞానంబ మల్లిక మాటలు నమ్మదు. కానీ మల్లిక గట్టిగా చెప్పటంతో జ్ఞానంబ తన గదిలోకి వెళ్లి అసలు నిజం ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటుంది.
షాక్ లో జ్ఞానంబ..
పక్కనే ఉన్న గోవిందరాజులు తన మాటలు నమ్మొద్దు అని చెబుతూ ఉంటాడు. ప్రతిసారి ఇదంతా ఎందుకు అని.. ఒకసారి వెళ్లి చూస్తే సరిపోతుంది అని అంటుంది. గోవిందరాజుల కు మరింత భయం పుట్టుకు వస్తుంది. ఇక జ్ఞానంబ వెళ్లి తన బీరువాలో చూడటంతో అక్కడ సర్టిఫికెట్లు ఉండకపోయేసరికి షాక్ అవుతుంది.
సంతోషంలో మల్లిక..
మల్లిక మాత్రం మురిసిపోతుంది. అంతే కాకుండా అకాడమీ ఇన్స్టిట్యూట్ కి అయితే అక్కడే జానకి వాళ్ళు ఉంటారు అని మల్లిక చెప్పటంతో జ్ఞానంబ అక్కడికి వెళ్లాలని అనుకుంటుంది. ఇక గోవిందరాజులు కూడా తప్పక ఏం చేయలేక బయలుదేరుతాడు. మల్లిక మాత్రం ఇవాళ జానకి పని అయిపోయింది అని బాగా సంతోషపడుతుంది.
ఇక జానకి అకాడమీలో తన సర్టిఫికెట్లు సబ్మిట్ చేస్తుంది. తన మనసులో తన అత్తయ్యను మోసం చేస్తున్నాను అని బాధపడుతుంది. ఒకరోజు ఈ విషయం గురించి అత్తయ్య కాళ్ళ మీద పడి బ్రతిమాలుకుంటాను అని అనుకుంటుంది. ఆ తర్వాత తొలి తొలి మూడు ర్యాంకులు వచ్చిన వారికి షీల్డ్ ప్రజెంటేషన్ జరుగుతుంది.
Janaki Kalaganaledu July 26 Today Episode: మొదటి ర్యాంకులో జానకి..
మరోవైపు జ్ఞానంబ వాళ్ళు బయలుదేరుతారు. గోవిందరాజులు ఏం జరగకూడదు అని దేవుడిని వేడుకుంటాడు. ఇక అకాడమీలో మొదట మూడో ర్యాంకు, రెండవ ర్యాంకు వారికి షీల్డ్ ప్రజెంటేషన్ చేస్తారు. రామ మాత్రం మీకు ఎప్పుడు వస్తుంది జానకి అంటూ ఆత్రుత పడతాడు. ఇక మొదటిలో జానకి పేరు పిలవడంతో అప్పుడే జ్ఞానంబ వాళ్ళు ఎంట్రీ ఇస్తారు.
సంతోషంలో జానకి దంపతులు..
ఇక జ్ఞానంబ జానకిని, రామను చూసి షాక్ అవుతుంది. ఇక జానకి బహుమతి తీసుకున్న తర్వాత అందరి ముందు వేదికపై ఆనందభాష్పాలతో మాట్లాడుతూ ఉంటుంది. తన విజయానికి వెనుక తన తండ్రి తన భర్త ఉన్నాడు అని చెబుతుంది. రామ మాత్రం తెగ సంతోషపడతాడు.