Janaki Kalaganaledu July 4 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో జానకి అసైన్మెంట్ పేపర్లు జ్ఞానంబ చేతిలో పడటంతో వెంటనే ఆ పేపర్లు ఏంటో అని తన చిన్న కొడుకుకు ఇచ్చి చెప్పమంటుంది. దాంతో అతడు ఆ పేపర్లు చూస్తూ ఉండగా అప్పుడే తన గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేయటంతో అవి వేస్ట్ పేపర్లు అని చెప్పి బయటికి వెళ్తాడు. అవి వేస్ట్ పేపర్లని తెలిసే నేను పేపర్లు వేసే అతడికి ఇస్తున్నాను అత్తయ్య గారు అంటూ మల్లిక అంటుంది. ఆ తర్వాత గోవిందరాజులు మల్లికతో వెటకారంగా మాట్లాడుతాడు.
సీన్ కట్ చేస్తే..
జానకి స్నానం చేసి బయటికి వచ్చి రెడీ అవుతుండగా అక్కడ ఉన్న తన అసైన్మెంట్ పేపర్లు కనిపించకపోయేసరికి టెన్షన్ పడుతుంది. ఇళ్లంతా వెతుకుతుంది. ఆ తర్వాత చికిత ను అడగటంతో తనకు తెలియదని కానీ మల్లిక పాత పేపర్లు అన్ని అమ్మేసింది అని బహుశా ఆ పేపర్లు కూడా అమ్మింది అనటంతో బాగా బాధపడుతుంది జానకి. ఒక చోట కూర్చొని తెగ టెన్షన్ పడుతూ కనిపిస్తుంది.
మల్లికపై కోపంతో రగిలిపోయిన జానకి..
అది చూసిన మల్లిక తోటి కోడలికి ఏం జరిగింది అని వెటకారంగా అనుకుంటూ.. వెళ్లి జానకిని పలకరిస్తుంది. ఇక జానకి వెంటనే కోపంతో రగిలిపోతూ మల్లికపై నీకు బుద్ధుందా అంటూ.. గదిలోకి ఎందుకు వచ్చావు అని.. పేపర్లు ఎందుకు అమ్మావు అని అరుస్తుంది. దాంతో మల్లిక జానకి ఇంతగా అరుస్తుంది అంటే అదేదో కారణం ఉంది అనుకుంటూ ఉంటుంది.
అప్పుడే గోవిందరాజులు, జ్ఞానంబ రావటంతో వారిని చూసి జానకి మౌనంగా ఉంటుంది. వెంటనే మల్లిక డ్రామా మొదలు పెడుతుంది. తనను కొట్టడానికి వచ్చింది అని అంటుంది. పేపర్లు అమ్మినందుకు నాపై అరుస్తుంది అని.. ఇంతకూ ఆ పేపర్లు ఏంటో అడగండి అని అంటుంది. జ్ఞానంబ జానకితో ఏ విషయంలో అయిన నువ్వు ఇంత కోపం చూపించవు అని.. ఎందుకు అంతలా కోపం చూపిస్తున్నావు ఇంతకూ ఆ పేపర్లు ఏంటని అడుగుతుంది.
పేపర్ల గురించి కవర్ చేసిన జానకి..
దాంతో జానకి ఆ పేపర్లు స్వీట్ షాప్ కి సంబంధించినవి అని కవర్ చేస్తుంది. మల్లిక మధ్య మధ్యలో తన మాటలతో తాలింపు చల్లుతూ ఉండగా జ్ఞానంబ మల్లికను తిడుతుంది. ఇక జానకి మౌనంగా ఉండిపోతుంది. ఆ తర్వాత జ్ఞానంబ పిల్లలకు భోజనాలు పంపించాలి అని వంట రెడీ చేయమని మల్లికకు చెబుతుంది.

Janaki Kalaganaledu July 4 Today Episode: వంట చేస్తూ అసైన్మెంట్ రాసుకుంటున్న జానకి..
ఇక మల్లిక తనకు ఒళ్ళు నొప్పులని వంట చేయటానికి తప్పించుకుంటుంది. అసైన్మెంట్ వర్క్ పూర్తి చేయాలి అని జానకి అనుకోగా జానకిని వంట చేయమని చెబుతుంది జ్ఞానంబ. ఆ తర్వాత జానకి టెన్షన్ పడుతూ వంట చేస్తూ ఉంటుంది. మధ్యలో తన అసైన్మెంట్ రాసుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అందరికీ భోజనం వడ్డించాక వెళ్లి మళ్లీ తన గదిలో కూర్చొని రాసుకుంటూ ఉంటుంది.