Janaki Kalaganaledu July 6 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో గోవిందరాజులకు నడుము నొప్పి రావడంతో ఇంట్లో వాళ్లంతా ఆందోళన చెందుతారు. ఇక డాక్టర్ వచ్చి పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని.. వేరే చోటకు తీసుకెళ్లినా కూడా ప్రమాదం ఎక్కువ అవుతుంది అని.. తనకు తెలిసిన హాస్పిటల్ లో వైద్య సదుపాయాలు ఉన్నాయో లేవా అని తెలుసుకుంటాను అని వేరే హాస్పిటల్ కి ఫోన్ చేస్తాడు డాక్టర్.
ఎమర్జెన్సీ ఇంజక్షన్ అందించిన జానకి..
ఇక అప్పుడే జానకి మామయ్య గారు అంటూ ఎమోషనల్ అవుతూ వస్తుంది. ఇక త్వర త్వరగా వచ్చి ఎమర్జెన్సీ ఇంజక్షన్ అని ఇస్తుంది. దాంతో డాక్టర్ ఆ ఇంజక్షన్ ఇవ్వగా గోవిందరాజులు నిద్రలోకి జారుకుంటారు. ఇక జానకి డాక్టర్ కి మందులు చూపించగా ఇది పాత మందులు అని ప్రస్తుతం అబ్జర్వేషన్ లో చూద్దాము అని అంటాడు.
ఆ సమయంలో మల్లిక తన నోటికొచ్చినట్లు వాగడం మొదలు పెట్టడంతో విష్ణు నోరు మూయిస్తాడు. ఇక అందరూ బయటికి వచ్చి మౌనంగా ఉంటారు. అదే సమయంలో మల్లిక జానకిని ఎలా బుక్ చేయాలి అని మధ్యలో పుల్ల వేస్తుంది. జానకి టాబ్లెట్ తేవడం ఆలస్యం అయ్యింది కాబట్టి మామయ్య గారికి ఇలా జరిగింది అంటూ నటిస్తుంది.
జానకిపై లేనిపోనీ నిందలు మోపుతున్న మల్లిక..
పది నిమిషాలలో టాబ్లెట్లు తీసుకొని రావచ్చు అని కానీ ఇంత ఆలస్యం ఎందుకు అయ్యింది అని జ్ఞానంబ కు అనుమానం వచ్చేలా చేస్తుంది. ఇక లేనిపోని మాటలు క్రియేట్ చేస్తూ మొత్తానికి జ్ఞానంబతో అడిగేలా చేస్తుంది. ఇక జ్ఞానంబ జానకి దగ్గరికి వచ్చి మెడిసిన్స్ తేవడానికి పది నిమిషాలు సమయం పడుతుంది కానీ నీకు ఇంత సమయం ఎందుకు పట్టింది అని అడుగుతుంది.
మధ్యలో మల్లిక కలగచేసుకుని రెండు మూడు గంటలు సినిమాకి వెళ్ళిందేమో అని మధ్యలో పుల్లలు వేస్తూ మాట్లాడగా.. వెంటనే జానకి కోపంతో మల్లిక నోరు మూయించి.. జ్ఞానంబ జరిగిన విషయం చెబుతుంది. నిజానికి మామయ్య బీపీ టాబ్లెట్లు అన్నాడని.. కానీ అక్కడికి వెళ్ళాక నడుము నొప్పి అని తెలిసింది అంటుంది.
నొప్పి నుండి ఉపశమనం పొందిన గోవిందరాజులు..
ఎమర్జెన్సీ ఇంజక్షన్ గురించి తెలియటంతో ఆలస్యమైన సరే ఆ ఇంజక్షన్ తేవాలి అని చాలా దూరం వెళ్ళాను అని చెబుతుంది. దాంతో జ్ఞానంబ కూల్ గా మాట్లాడుతుంది. ఆ తర్వాత గోవిందరాజులు డాక్టర్ తో తనకు ఇప్పుడు బాగానే ఉంది అనడంతో.. డాక్టర్ వచ్చి వాళ్లకు ఇప్పుడు ఆయన ఓకే అని చెప్పి వెళ్తాడు. ఆ తర్వాత జానకిని జ్ఞానంబ దగ్గరికి తీసుకొని కృతజ్ఞతలు తెలుపుతుంది.

Janaki Kalaganaledu July 6 Today Episode:జ్ఞానంబకు తెలిసిన నిజం..
ఆ తర్వాత జానకి దంపతులు తమ గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రామ జానకిని తన తండ్రి కాపాడాడు అని కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాడు. ఇక జానకి తనకు కృతజ్ఞతలు చెప్పవద్దని.. అది నా బాధ్యత అని అంటుంది. కానీ మీతో నేను సమయం గడపలేకపోతున్నాను అని బాధపడుతుంది. దాంతో రామ కేవలం మీ ఐపీఎస్ చదువు కోసం నన్ను దూరం పెడుతున్నారే తప్ప మరే ఉద్దేశం లేదు కదా అనడంతో ఆ మాటలు జ్ఞానంబ విని షాక్ అవుతుంది.