Janaki Kalaganaledu July 7 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో.. జానకి తన భర్తతో పెళ్లి అయ్యాక ఒక ఆనందం, సంతోషాన్ని కూడా కోరుకోలేదు నేను భార్యగా మీ కోరికలను తీర్చడం నా బాధ్యత మనం సంసార జీవితాన్ని మొదలు పెడదామంటూ తన భర్తతో చెప్తుంది. ఇక చదువుకునే దానిలో పడి మీ కోరికలన్నీ నేను దూరం చేస్తున్నానని అనడంతో పర్వాలేదు జానకి మన గొప్ప ఆశయం కోసమే దూరంగా ఉన్నాము అని అంటాడు.
కొడుకు కోడలి మాటలను చాటుగా విన్న జ్ఞానంబ..
ఇక ఆ మాటలు జ్ఞానంబు చాటుగా ఉండి వింటుంది. ఇక జానకి రామాతో పర్వాలేదు మనం పిల్లల్ని కనడం అత్తయ్య కూడా సంతోషంగా ఉంటుందని అంటుంది. కానీ ఇప్పుడు మీరు బాగా చదువుకుని గొప్ప స్థాయికి చేరాలని అంటాడు. ఇక చాటుగా వింటున్న జ్ఞానంగా తన మనసులో వీళ్లు ఎందుకు పిల్లల్ని వద్దనుకుంటున్నారు అని అనుకుంటూ ఏదో లక్ష్యం అంటున్నారు ఏంటో తెలుసుకోవాలని అనుకుంటుంది.
సీన్ కట్ చేస్తే..
ఉదయాన్నే జానకి నేను కొట్టుకు వెళ్లి వస్తానని అంటాడు. కానీ జానకి సరదాగా.. ఎందుకు మీరు ఎప్పుడు కొట్టేనా మీకు నేను కూడా భార్యను ఉన్నానని గుర్తు పెట్టుకోండి అంటూ రొమాంటిక్ గా మాట్లాడుతు వాళ్ళిద్దరూ సరదాగా గొడవ పడుతుంటారు. అప్పుడు వారి మధ్యలో ప్రేమతో ఒక్కరి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు.
ఆ తర్వాత రామ జానకితో తన లక్ష్యాన్ని పూర్తి చేసుకోమని చెప్పి ఆ తర్వాతనే కాపురం మొదలు పెడదామని అంటాడు రామ. ఆ తరువాత జానకి కూరగాయలు కట్ చేస్తూ తన అత్తగారికి ఇచ్చిన మాటలను తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఆ సమయంలో చేయి కట్ చేసుకుంటుంది. వెంటనే జ్ఞానంబ వచ్చి బాధపడుతుంది.
తన అత్తకు మాట ఇచ్చిన జానకి..
అంతేకాకుండా జానకితో.. ఏమైందమ్మా నిన్ను ఇంత పరిజ్ఞానంతో చూడలేదు అంటూ ప్రేమగా అడుగుతుంది. అంతే కాకుండా నువ్వు ఏదో విషయం దాస్తున్నావు అని.. నేను వారసుడిని అడిగినప్పటి నుంచి నువ్వు అయోమయంగా ఉన్నావని అంటుంది. ఏదైనా ఉంటే నాతో చెప్పమ్మా అని అంటుంది. దాంతో జానకి అలా ఏమీ లేదు అని త్వరలో నీకు మనుమడిని ఇస్తాను అని మాట ఇస్తుంది.
అయినా కూడా జ్ఞానంగా మళ్ళీ ఆలోచనలో పడుతుంది. ఇక జ్ఞానంబ ఒంటరిగా కూర్చొని జానకి దంపతులు మాట్లాడిన మాటలను తలచుకుంటుంది. ఓవైపు జానకి రామ కోసం అందంగా రెడీ అయి ఎదురుచూస్తుంది. అది చూసిన మల్లిక ఇలా ఎందుకు రెడీ అయింది అని ఆలోచనలో పడుతుంది.

Janaki Kalaganaledu July 7 Today Episode: రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిన రామ, జానకి..
అప్పుడే రామ రావటంతో జానకి, రామ మధ్య రొమాంటిక్ మూడ్ కనిపిస్తుంది. మల్లిక వాళ్లను చూసి అలాగే ఆలోచనలో పడుతూ ఉంటుంది. ఇక జానకి, రామ తమ గదిలోకి వెళ్ళగా రామ జానకి అందాలను చూసి తట్టుకోలేకపోతూ కంట్రోల్ చేసుకుంటూ కనిపిస్తాడు. జానకి మాత్రం రామను రొమాంటిక్ మూడ్ లోకి తీసుకొని వెళ్తుంది.