Janaki kalaganaledu June 1 Episode: ఈ రోజు ఎపిసోడ్ లో మల్లిక రామచంద్ర, జానకి హైదరాబాద్ కు వెళ్లకుండా చేయాలి అని గోవిందరాజుల, జ్ఞానంబల టాబ్లెట్లను మార్చుతుంది. ఈ టాబ్లెట్ వేసుకొని జ్ఞానంబకు కాస్త అటు ఇటు గా ఉంటుందని దాంతో వాళ్లు వెళ్లకుండా ఉండిపోతారు అని మురిసిపోతుంది. ఇక అక్కడకు జ్ఞానంబ రావటంతో మల్లిక వెళ్లి దాచుకుంటుంది.
హైదరాబాద్ కు బయలుదేరుతున్న జానకి దంపతులు..
ఇక జ్ఞానంబ వెళ్లి మొత్తానికి మార్చేసిన టాబ్లెట్ వేసుకుంటుంది. అది చూసి మల్లికా బాగా సంతోషపడుతుంది. మరోవైపు గోవిందరాజులు తన కొడుకు కోడల్ని హైదరాబాద్ పంపించే ఏర్పాట్లు చేశాడు. ఇ క రామచంద్ర అమ్మకు చెప్పకుండా వెళ్తున్నందుకు బాధగా ఉంది అని బాధ పడతాడు. దాంతో గోవిందరాజులు అవి మనసులో పెట్టుకోకని గెలిచి ఇంటికి రా అని ధైర్యం ఇస్తాడు.
జ్ఞానంబ కూడా వాళ్లను పంపించడానికి వస్తుంది. బయట ఏమి తినకండి అంటూ స్వయంగా తాను తయారు చేసి ఇచ్చిన పదార్థాలను ఇస్తుంది. అదంతా చూస్తున్నా మల్లిక ఇంకా ఏం జరుగుతుందో లేదు అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే విష్ణు వచ్చి హ్యాపీ జర్నీ అని అంటాడు. ఇక రామ వాళ్ళు బయలుదేరుతుండగా వెంటనే జ్ఞానాంబకు కళ్ళు తిరుగుతాయి.
అస్వస్థకు గురైన జ్ఞానంబ..
వెంటనే అందరూ జ్ఞానంబకు ఏం జరిగిందో అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక జ్ఞానాంబ తను టాబ్లెట్లు వేసుకున్నాను అని అంతలోనే ఇలా అయింది అని అంటుంది. మల్లిక మాత్రం తన ప్లాన్ సక్సెస్ అయ్యింది అని బాగా మురిసిపోతుంది. వెంటనే జానకి డాక్టర్ కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెబుతుంది. ఆ తర్వాత ఏం టాబ్లెట్ లు వేసకున్నారో అని చూస్తుంది జానకి.
ఇక టాబ్లెట్లు పొరపాటు కావటంతో వెంటనే ఉప్పు నీళ్లు కలిపుతుంది. అదేసమయంలో లూసీ జానకి కి ఫోన్ చేసి బయలుదేరారా అని అడుగుతుంది. దాంతో జానకి బయలుదేరి సమయంలో తన అత్తయ్య అస్వస్థతకు గురైంది అని చెబుతుంది. ఇక లూసీ ఎలాగైనా మీరు హైదరాబాద్ కి రావాలి అని చెబుతుంది. వెంటనే జానకి ఆ వాటర్ తీసుకొని తన అత్తయ్యకు తాపిస్తుంది.
ఆ తర్వాత తన పాదాలకు గట్టిగా రాస్తుంది. పక్కనే ఉన్న మల్లిక ఏం జరిగిందో అని భయ పడుతూ ఉంటుంది. ఏదైనా జరిగితే తనని జైల్లో వేస్తారు అని భయపడుతుంది. వెంటనే తాను కూడా తన అత్తయ్య కు సేవ చేస్తుంది. అప్పుడే డాక్టర్ రావడంతో ఆమె చికిత్స చేస్తుంది. ఆ సమయంలో మల్లిక చాలా ఓవర్ గా నటిస్తుంది.

Janaki kalaganaledu June 1 Episode: తల్లికి నిజాన్ని బయట పెట్టనున్న రామ..
జానకికి మళ్లీ లూసీ ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ వెళ్లి జ్ఞానంబ ను పలకరిస్తారు. ఇక రామచంద్ర తన తల్లితో నిజం చెప్పకుండా వెళుతున్నందుకు ఇలా జరుగుతుంది అని బాధపడతాడు. దాంతో జ్ఞానంబ ఏం జరుగుతుంది అన్నట్లుగా చూస్తుంది. మరి ఈ విషయం గురించి జ్ఞానంబ జానకి వాళ్లపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.