Janaki Kalaganaledu June 21 Episode: ఈరోజు ఎపిసోడ్ లో.. జానకి, రామ ఇద్దరు కలిసి సునంద ఇంటికి వెళ్లి డబ్బులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కన్నబాబు తమ దగ్గర ఉన్న సాక్షి పత్రం జానకికి ఇవ్వగా.. వెంటనే జానకి ఆ పేపర్ ను చింపేసి వారికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. తన భర్త దగ్గరికి ఎవరైనా వస్తే ఊరుకునేది లేదు అని.. ఆయనకు నేను తోడుగా ఉన్నాను అని.. ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే నన్ను దాటాల్సి ఉంటుంది అని గట్టిగా అంటుంది. ఇక రామచంద్ర కూడా కన్నబాబు తో గట్టిగా మాట్లాడుతాడు. వారి మాటలు వింటున్న సునంద మాత్రం ఏమి అనలేకుండా లోలోపల కుమిలిపోతుంది.
సీన్ కట్ చేస్తే..
జానకి రామచంద్ర చెయ్యి పట్టుకొని వెళ్తుండగా రామచంద్ర జానకిని అలాగే చూస్తూ ఉంటాడు. తన ధైర్యం జానకి అని సంతోషంగా ఉంటాడు. ఇక జానకి తమ గదిని శుభ్రం చేస్తూ ఉండగా రామచంద్ర అలాగే చూస్తూ ఉండిపోతాడు. జానకి ఎందుకలా చూస్తున్నావు అనటంతో.. వెంటనే రామచంద్ర నీకు ఒక మాట చెబితే నువ్వు దానిని ఒప్పుకోవు అని అనడంతో వెంటనే జానకి ఏంటి అని అడుగుతుంది.
నుదుటి మీద ముద్దులు పెట్టుకున్న జానకి దంపతులు..
ఇక రామచంద్ర థాంక్స్ అన్న విషయం అనడంతో జానకి కూడా నేనే మీకు తిరిగి థాంక్స్ చెప్పాలి అని.. నా చదువు కోసం మీరు చాలా కష్టపడుతున్నారు అని అంటుంది. ఆ తర్వాత జానకి రామ నుదిటిపై ముద్దు పెట్టడంతో.. తిరిగి రామ కూడా తనకు ముద్దు పెడతాడు. ఇక మరుసటి రోజు లీలావతి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉండగా అక్కడికి రామను ఇంటర్వ్యూ చేసే మీడియా వాళ్లు రామ ఇంటి అడ్రస్ అడుగుతారు.
దాంతో మీడియా వాళ్లు రామచంద్ర ఇంటికి వెళ్లగా.. అందరూ రామ ఇంటర్వ్యూ కోసం వచ్చారు అని సంతోష పడతారు. మల్లికకు మాత్రం బాగా మండిపోతూ ఉంటుంది. ఇక జ్ఞానాంబ ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం లేదు అని.. వాళ్ళు అడిగే ప్రశ్నలకు రామ సమాధానం చెప్పలేడు అని అనటంతో గోవిందరాజులు, జానకి అలా ఏం జరగదు అని చెబుతూ ఉంటారు.

Janaki Kalaganaledu June 21 Episode: జ్ఞానంబకు ధైర్యం ఇచ్చిన జానకి..
మొత్తానికి జానకి బ్రతిమాలడం తో.. జ్ఞానంబ ఒప్పుకుంటుంది. మల్లిక మాత్రం బాగా కుళ్ళు కుంటుంది. వెంటనే నీలావతి ని బయటికి తీసుకుని వచ్చి ఎందుకు వాళ్ళని ఇంటికి తీసుకు వచ్చావు అని తనపై అరుస్తుంది. ఇక నీలావతి నువ్వు ఇప్పుడు టీవీలో కనిపించవచ్చు అని వెంటనే మేకప్ కోసం ఇంట్లోకి పరుగులు తీస్తుంది. ఇక జానకి ఇంట్లో రామచంద్రను రెడీ చేస్తూ ఉంటుంది. మరోవైపు జ్ఞానంబ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉండగా.. జానకి వచ్చి అలా ఏమీ జరగదు అని.. మిమ్మల్ని చూసి వాళ్లే ప్రశ్నలు అడగటానికి భయపడతారు అని ధైర్యం ఇస్తుంది.