Janaki Kalaganaledu June 22 Episode: ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానంబ ఇంటర్వ్యూ కోసం కాస్త టెన్షన్ పడుతూ కనిపించగా జానకి వచ్చి ధైర్యం ఇస్తుంది. మీరు ధైర్యంగా మాట్లాడతారన్న నమ్మకం ఉంది.. మీ హుందాతనం తోనే వాళ్లు ప్రశ్నలు అడగటానికి భయపడతారు అని తన మాటలతో ధైర్యం చెబుతుంది. దాంతో జ్ఞానంబ జానకి మాటలకు ధైర్యం తెచ్చుకుంటుంది.
సీన్ కట్ చేస్తే..
అద్దం ముందు మల్లిక నిలబడి తన అందాన్ని చూసుకొని తెగ మురిసిపోతుంది. ఇక తన అందాన్ని ఐశ్వర్య రాయ్ తో పోలుస్తూ ఉంటుంది. తనని టీవీలో చూసి అందరూ ఆశ్చర్య పోతారని మురిసి పోతూ ఉండగా అప్పుడే విష్ణు వచ్చి మల్లికకు తగిలేలా పంచులు వేస్తూ ఉంటాడు. ఆ తర్వాత అందరు ఇంటర్వ్యూకు సిద్ధమవ్వగా జానకి జ్ఞానంబ కు ధైర్యం చెబుతూ ఉంటుంది.
కెమెరా ముందు మల్లిక ఓవర్..
మల్లిక కెమెరా ముందు బాగా ఓవర్ చేస్తూ ఉంటుంది. మైక్ తీసుకొని తన బావగారికి తానే కొన్ని టిప్స్ చెప్పాను అని లేనివన్ని చెప్పుకుంటుంది. ఇక జ్ఞానంబ మల్లిక నోరు మూయించేలా చేస్తుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ పూర్తవ్వగా.. ఆ యాంకర్ రామచంద్ర ను పోగొడుతుంది. అంతే కాకుండా రామచంద్రకు ధైర్యంగా నిలిచిన తల్లి, భార్య లను కూడా పోగొడుతుంది.
ఆ తర్వాత జానకి, రామచంద్ర వెన్నెల కాంతులను ఆస్వాదిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. జానకి వంటల ప్రోగ్రామ్ లో పాల్గొన్నప్పటినుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు అని.. అయినా గెలిచి మీరు ఏంటో నిరూపించుకున్నారు అని రామచంద్రను అంటుంది. దాంతో రామచంద్ర దీనికి కారణం అంతా మీరే అని జానకిని పొగుడుతాడు.
ఇక తన ఆలోచనల్లో పడి జానకి చదువుకోవడం మర్చిపోయింది అని.. తనకోసం బుక్ తీసుకొని వస్తాడు. కానీ జానకి రేప్పటినుండి చదువుకుంటాను అని.. ఈరోజు మీ గెలుపు ని సంతోషంగా ఆస్వాదిస్తాను అని రామ తో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం అందరు గుడికి బయలుదేరుతారు.
జానకికి పొగడ్తల వర్షం..
అక్కడ కొందరు.. ఇంటర్వ్యూలో జ్ఞానంబ మాట్లాడిన మాటలను పొగుడుతూ ఉంటారు. అంతేకాకుండా రామచంద్రను పక్కనే ఉన్న జానకిని కూడా పొగడ్తలతో ముంచడం తో అక్కడే ఉన్న మల్లిక మాత్రం బాగా కుళ్లుకుంటూ కనిపిస్తుంది. వాళ్లు మాత్రం జానకి లాంటి కోడలు ఎవరికి దొరకదు అని బాగా పొగుడుతూ ఉంటారు.
Janaki Kalaganaledu June 22 Episode: సంతోషంలో జ్ఞానాంబ కుటుంబం..
ఆ తర్వాత మల్లిక జానకి గురించి జ్ఞానంబ కు లేనిపోని చాడీలు చెప్పటం తో తిరిగి జ్ఞానాంబ మల్లికకు గట్టి కౌంటర్ ఇస్తుంది. ఇక గుడిలో అర్చనకోసం రామ డబ్బులు ఇస్తుండగా అప్పుడే పూజారి అక్కడికి వచ్చి.. ఇకపై మీరు డబ్బులు ఇవ్వదు అని.. మీ కోడలు గుడికి విరాళంగా కొన్ని డబ్బులు ఇచ్చిందని అనడంతో అందరూ ఆశ్చర్యపోతారు. అంతే కాకుండా సంతోషంగా ఫీల్ అవుతారు.