Janaki Kalaganaledu June 23 Episode: ఈరోజు ఎపిసోడ్ లో గుడి దగ్గర పూజారిగారు జానకి గురించి జ్ఞానంతో గొప్పగా చెబుతూ ఉండగా.. మధ్యలో వెన్నెల మా నాన్న ఉంటే ఎలా ఉండేది తెలుసా అని అనడంతో అప్పుడే మల్లిక మధ్యలో కలుగజేసుకొని.. తన మామయ్య జానకి గురించి గొప్పగా ఇలా అంటాడు అని వెటకారం గా మాట్లాడుతూ ఉంటుంది.
ఆ తర్వాత అందరూ పూజలో పాల్గొనగా అక్కడ జ్ఞానంబ తన కుటుంబం గురించి రామచంద్ర గురించి అమ్మవారికి వేడుకుంటుంది. పూజ అనంతరం రామచంద్ర జ్ఞానంబను సర్ప్రైజ్ అంటూ ఒక చోటకు తీసుకుని వెళుతూ ఉంటాడు. దాంతో అందరూ ఏంటా సర్ ప్రైజ్ అని ఆలోచనలో పడతారు. మల్లిక మాత్రం అదేంటో తెలుసుకోవడానికి బాగా ఆత్రుత పడుతుంది.
సీన్ కట్ చేస్తే..
అందరూ భోజనానికి సిద్ధంగా ఉంటారు. తాము చేసే సర్ప్రైజ్ ఇదే అని రామ తన తల్లితో చెబుతాడు. జానకి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించాము అని మీ చేతుల మీద అందరికీ భోజనం వడ్డించు అని అంటుంది. ఆ తర్వాత జానకి మీకు చెప్పకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నందుకు క్షమించమని అంటుంది.
జానకి మెచ్చుకుంటున్న కుటుంబ సభ్యులు..
ఆ తర్వాత అందరూ జానకి చేసింది మంచిపని అని పొగుడుతూ ఉంటారు. ఇక జ్ఞానంబ తన చేతులతో భోజనం వడ్డించమని జానకి అనటంతో జ్ఞానంబ తో పాటు అందరూ భోజనం వడ్డిస్తుంటారు. ఇక అందరూ రామచంద్ర దంపతులను దీవిస్తూ ఉంటారు. మరోవైపు మల్లిక ఒక దగ్గరికి వెళ్లి కడుపు మంటతో కనిపిస్తుంది.
జానకి మంచి పేరు సంపాదించుకుంది అని బాగా కుళ్ళు కుంటుంది.
అప్పుడే విష్ణు అక్కడికి వెళ్ళి తన మాటలతో తనను మరింత బాధ పెడుతూ ఉంటాడు. ఆ తర్వాత నిన్ను కూడా అమ్మ ముందు మంచి స్థాయిలో ఉంచుతాను అని అంటాడు. దాంతో మల్లిక సరే అని తెగ సంతోష పడుతుంది. మరోవైపు జ్ఞానాంబ అక్కడ భోజనం చేసే వాళ్ళందరూ తమ కుటుంబాన్ని దీవిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది అని అంటుంది.
మొక్కు చెల్లించుకున్న మల్లిక..
అప్పుడే విష్ణు వచ్చి మల్లిక గెలిచి వస్తే దేవుడికి మొక్కు చెల్లిస్తాను అని అన్నదని.. అదేదో కాదు.. శివుడికి 108 బిందెలతో అభిషేకం చేస్తుందని అనడంతో మల్లిక షాక్ అవుతుంది. మొత్తానికి మల్లిక 108 బిందెలతో దేవుడికి అభిషేకం చేస్తుంది. ఆ తర్వాత అందరూ ఇంటికని బయలుదేరుతూ ఉండగా జానకి బొట్టు కోసం లోపలికి వెళుతుంది.

Janaki Kalaganaledu June 23 Episode: కుటుంబ సభ్యులను కాపాడిన జానకి..
రామ కారు కోసం బయటికి వెళ్తాడు. ఆ సమయంలో జ్ఞానంబ వాళ్లు అందరూ బయటికి నడుచుకుంటూ వెళుతూ ఉండగా అక్కడ కరెంటు తీగ కిందపడిపోయి ఉండడాన్ని జానకి గమనిస్తుంది. అది చూసి ప్రమాదమని వెంటనే దానిని కర్రతో పక్కకు జరిపి వేగంగా తను ఒక దగ్గరికి వెళ్లి కింద పడుతుంది. దాంతో తన తలకు గాయం కావడంతో అందరూ భయపడిపోతుంటారు. ఇక జానకి మాత్రం స్పృహలో లేనట్లు కనిపిస్తుంది.