Janaki Ram Wife: టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నందమూరి తారక రామారావు వారసులుగా ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా అడుగుపెట్టి రాణిస్తున్నారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ , జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీలో హీరోలుగా మంచి గుర్తింపు పొందారు. ఇదిలా ఉండగా నందమూరి కుటుంబంలో మరొకసారి రెండో పెళ్లి జరిగిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. హరికృష్ణ ముగ్గురు కుమారులలో పెద్దవాడైన జానకిరామ్ గతంలో మృతి చెందిన సంగతి అందరికీ తెలిసింది. జానకి రామ్ కి ఇద్దరు కుమారులు.
ఇక జానకిరామ్ భార్య పేరు దీపిక. ఆమె ఇంటికే పరిమితం అవ్వటం వల్ల ఇండస్ట్రీలో ఎక్కువ మందికి ఆమె గురించి తెలియదు. కానీ ప్రస్తుతం జానకిరామ్ భార్య అయిన దీపిక గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె గురించి తెలుసుకోవటానికి నెటిజన్స్ ఆసక్తి చూపుతున్నారు. రోడ్డు ప్రమాదంలో జానకిరామ్ మరణించిన తర్వాత దీపిక తన ఇద్దరి పిల్లలను చూసుకుంటూ జీవిస్తోంది. అయితే జానకిరామ్ మరణం తర్వాత ఆమె అలా ఒంటరిగా ఉండటం కుటుంబ సభ్యులకు ఏమాత్రం ఇష్టం లేదు. అందువల్ల ఆమెను రెండో వివాహం చేసుకోవాలని కుటుంబ సభ్యులు కోరగా.. వారి కోరిక మేరకు దీపిక రెండవ వివాహం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Janaki Ram Wife: నిజంగానే రెండో పెళ్లి చేసుకుందా…
అతి తక్కువ మంది కుటుంబ సభ్యుల సమక్షంలో దీపిక రెండవ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో నందమూరి కుటుంబంలో మరొకసారి రెండవ పెళ్లి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. జానకిరామ్ భార్య దీపిక రెండవ పెళ్లి చేసుకుందన్న వార్త తెలియగానే ఆమె గురించి తెలుసుకోవటానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు నందమూరి కుటుంబం స్పందించకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఆమె రెండవ పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా బయటికి రాలేదు. అసలు ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే నందమూరి కుటుంబ సభ్యులు స్పందించాల్సి ఉంటుంది.