Janhvi Kapoor హిందీలో దడక్ అనే చిత్రం లో హీరోయిన్గా నటించి టాలీవుడ్ ప్రముఖ బ్యూటిఫుల్ మరియు స్వర్గీయ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ అమ్మడు తన తల్లి మాదిరిగా ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేక పోతుంది. అంతేకాకుండా కథల విషయంలో కూడా సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో కొంతమేర ఈ బ్యూటీ డిజాస్టర్లను ఎదుర్కొంటోంది.
కానీ సినీ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి రావడంతో అవకాశాలకు డోకా లేకపోయినప్పటికీ చెప్పుకోవడానికి పెద్దగా హిట్లు మాత్రం లేవు. దీంతో జాన్వీకపూర్ మంచి హిట్ కోసం బాగానే శ్రమిస్తోంది. ఈ క్రమంలో వరుసగా ఫోటో షూట్లు, మ్యాగజైన్ కి ఫోజులు ఇస్తూ ఆఫర్లను ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
అయితే సోషల్ మీడియా మాధ్యమాల వినియోగం ఎక్కువ అయిన తర్వాత కొందరు సినీ సెలబ్రిటీలు తమ ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ రోజురోజుకి ఫాలోవర్ల సంఖ్యలో పెంచుకుంటున్నారు. దీంతో జాన్వి కపూర్ కూడా ఇదే కోవలో పయనిస్తోంది. ఇందులో భాగంగా ఈ అమ్మడు అప్పుడప్పుడు తన అందమైన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతోంది.

కాగా తాజాగా ఈ అమ్మడు జిమ్ లో వర్కౌట్లు చేస్తూ ఉండగా తీసినటువంటి ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకేముంది ఈ ఫోటోలు షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే లక్షల సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి. అలాగే ఇంత ఘాటుగా వర్కవుట్లు చేస్తే ఫిట్నెస్ తో పాటూ ఫాలోవర్స్ కూడా పెరుగుతారని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా నటి జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగులో ప్రముఖ హీరో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ బ్యూటీ బాలీవుడ్ లో కూడా దాదాపుగా మూడు చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పటివరకూ జాన్వీ కపూర్ నాలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించగా ఇందులో కనీసం ఒక్క చిత్రం కూడా చెప్పుకో దగ్గ హిట్ కాలేదు. దీంతో ఇలాగే కొనసాగితే ఈ అమ్మడి సినీ కెరియర్ కొంతమేరకు ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.