Janhvi Kapoor: బాలీవుడ్ భామ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలనాటినటి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వి కపూర్ బాలీవుడ్లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక ఈ అమ్మడు ఇటీవల ” దేవర ” సినిమా ద్వారా టాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా అవకాశం కొట్టేసింది. ప్రస్తుతం ఈ సినిమాతో పాటు మరికొన్ని బాలీవుడ్ సినిమాలతో జాన్వీ కపూర్ బిజీగా ఉంది.
ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ తన తల్లి శ్రీదేవిని తలుచుకుంటూ ఎమోషనల్ అయింది. తన తల్లితో గడిపిన చివరి క్షణాలను తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. 2018లో శ్రీదేవి దుబాయ్ లోని ఒక హోటల్లో కన్ను మూసింది. ఆమె ఆకస్మిక మరణంతో యావత్ సినిమా ఇండస్ట్రీ దుఃఖ సంద్రంలో మునిగిపోయింది. ఎన్నో ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయకగా రాణిస్తూ తన అందం అభినయంతో ప్రేక్షకుల మనసుకి దగ్గరైన శ్రీదేవి అలా హఠాన్మరణం చెందటంతో ఆమె కోసం ఎన్నో గుండెలు రోదించాయి.
Janhvi Kapoor: అవే అమ్మతో ఆఖరి క్షణాలు…
ఆమె కుటుంబం కూడా ఇప్పటికీ శ్రీదేవి లేని లోటుని మర్చిపోలేక పోతోంది. శ్రీదేవి కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ ఇప్పటికి తన తల్లిని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీదేవి గురించి మాట్లాడుతూఎమోషనల్ అయ్యింది.” అమ్మ దుబాయ్‌కి వెళ్లడంతో బిజీగా ఉంది. నేను షూటింగ్‌తో అలసిపోయాను. అప్పుడు నేను అమ్మకి చెప్పాను నాకు నిద్ర వస్తోంది.. అమ్మ నా గదిలోకి వచ్చినప్పుడు నేను నిద్రపోతున్నాను .. కానీ అమ్మ అక్కడ ఉందని నాకు తెలుసు’. ఆ రోజు పనులన్నీ ముగించుకుని నా దగ్గరకు వచ్చింది. ఆమె నన్ను దగ్గరగా పట్టుకుని, నా తలపై చేతులు వేసింది.’ అంటూ తల్లితో గడిపిన చివరి క్షణాల గురించి చెబుతూ జాన్వీ కపూర్ ఎమోషనల్ అయింది.