Janhvi Kapoor మామూలుగా సినీ సెలబ్రిటీల పిల్లలపై సోషల్ మీడియా మాధ్యమాలలో చాలా మంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో ఎప్పుడెప్పుడు వారికి సంబంధించిన అప్డేట్లు వస్తాయా అని కొంతమందయితే చాలా ఆతృతతో ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో సినీ సెలబ్రిటీల గురించి ఏదైనా తప్పు దొర్లినా లేదా అసభ్యకరంగా కనిపించిన ట్రోలింగ్ మాత్రం తప్పదు.
అయితే మాజీ ప్రపంచ సుందరి మరియు స్వర్గీయ నటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో సినిమాల్లో కంటే ఎక్కువగా ఈ ఫోటోలకు ఫోజులు ఇస్తూ కుర్రకారుకి లేకుండా చేస్తుంది.
అయితే జాన్వీ కపూర్ తన స్నేహితురాలు ఇచ్చినటువంటి ఓ నైట్ పార్టీ కి వెళ్ళింది. ఈ క్రమంలో ఈ అమ్మడు కొంతమేర పొట్టి దుస్తులు ధరించి కెమెరాలకి చిక్కింది. ఇంకేముంది ఇది నటి జాన్వీ కపూర్ కారు దిగుతున్న సమయంలో తీసినటువంటి వీడియోని కొంత మంది నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా డ్రెస్సులు వేసుకొని బయటికి రావడం అవసరమా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరికొందరు మాత్రం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఫాస్ట్ కల్చర్ ఉంటుందని కాబట్టి లేట్ నైట్ పార్టీస్ బికినీ డ్రెస్ లాంటివి చాలా కామన్ అని ఇలాంటివి పట్టించుకోవద్దని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఎంత స్పీడ్ కల్చర్ అయితే మాత్రం ప్రైవేట్ శరీర భాగాలు కనిపించే విధంగా దుస్తులు ధరించడం సరికాదని అలాగే సెలబ్రిటీలు బాహ్య ప్రపంచానికి వచ్చిన సమయంలో ఇలాంటి దుస్తులు ధరిస్తే అభాసు పాలవుతారని కాబట్టి ఇక నుంచి అయినా కొంచెం పద్ధతిగా డ్రెస్ చేసుకుని బయటకు రావాలని సూచిస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో జాన్వికపూర్ వరుసగా ఆఫర్లు వస్తున్నప్పటికీ కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో వరుస డిజాస్టర్లు వరిస్తున్నాయి. కాగా ఇటీవల జాన్వీ కపూర్ కి తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా ఆఫర్ వచ్చినట్లు వినిపించాయి. కానీ జాన్వీ కపూర్ మాత్రం ఎన్టీఆర్ సరసన నటించడం లేదని ఆ మధ్య సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్ చేసింది.