Faria Abdullah : “చిట్టి అక్కడ షేవ్ చేసుకోలేదా”? అన్నా నెటిజన్.. దానికి ఆ హీరోయిన్ ఇలా రిప్లై ఇచ్చిందేంటి..!

Bharath Cine Desk

Faria Abdullah : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి “జాతి రత్నాలు” సినిమాతో హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా ఎంట్రీ ఇచ్చింది. జాతి రత్నాలోని చిట్టి గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోలేని స్థానాన్ని సంపాదించుకుంది. వాస్తవానికి ఫరియా హీరోయిన్ గా పరిచయం కాకముందే.. యూట్యూబెర్ గా హైదరాబాద్ కుర్ర కార్లకు సుపరిచితమే. ఇప్పుడు ఫరియా అబ్దుల్లా వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్తుంది. ఈ హైదరాబాద్ బ్యూటీకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఇటు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటు.. డ్యాన్స్ ,యోగ కి సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో తాజాగా పోస్ట్ చేసిన ఒక ఫోటో కింద ఓ నెటిజన్ చేసిన అసభ్యకరమైన కామెంట్ కి ..చిట్టి అదిరిపోయే సమాధానమిచ్చింది.

తాజాగా యోగా కి సంబంధించిన తన తోటి ఆర్టిస్ట్ హర్ష కోమెట్‌ ఫోటోని ఫరియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఓ నెటిజన్ ” చిట్టీ సంకలో షేవ్ చేసుకోలేదా ?” అని అసభ్యకరంగా కామెంట్ పెట్టాడు. దానికి ఫరియా ” చేసిన.. మళ్ళీ వచ్చింది..ఎన్ని సార్లు చేయాలా” అంటూ దిమ్మతిరిగే బోల్డ్ రిప్లై ఇచ్చింది. దీంతో ఆ రిప్లై చూసి వల్గర్ కామెంట్స్ చేసిన సదరు నెటిజన్ ఆ కామెంట్ ని వెంటనే డిలీట్ చేశాడు. కాని అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంత జరిగిపోయింది.. కొందరు ఆ కామెంట్ డిలీట్ చేయకముందే స్క్రీన్ షాట్స్ తీయడంతో.. అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫరియా అబ్దుల్లా మీరు అలాంటి వారికి ఇలానే బుద్ధి చెప్పాలంటూ మిమీర్స్ మద్దతు తెలుపుతున్నారు.

Faria Abdullah : "చిట్టి అక్కడ షేవ్ చేసుకోలేదా"? అన్నా నెటిజన్.. దానికి ఆ హీరోయిన్ ఇలా రిప్లై ఇచ్చిందేంటి..!
Faria Abdullah : “చిట్టి అక్కడ షేవ్ చేసుకోలేదా”? అన్నా నెటిజన్.. దానికి ఆ హీరోయిన్ ఇలా రిప్లై ఇచ్చిందేంటి..!

ఇక సినిమాల విషయానికొస్తే కింగ్ అక్కినేని నాగార్జున, నాగ చైతన్య నటిస్తున్న బంగార్రాజు సినిమాలోని ఓ ఐటెం సాంగ్ కి చిట్టి చిందు వేయబోతుందని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న `ఢీ అండ్ ఢీ` చిత్రంలో హీరోయిన్‌గా ఫరియా అబ్దుల్లా చేస్తోందట. ఇక మరోవైపు మాస్ మహారాజ్ రవితేజతోనూ ఓ సినిమాలో నటిస్తోందని టాక్‌.

 

- Advertisement -