Jayaprada: సీనియర్ నటి జయప్రద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఒకానొక సమయంలో తెలుగు తమిళ హిందీ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి జయప్రద ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అయితే ప్రస్తుతం ఈమె సినిమాలలో కాకుండా రాజకీయాలపై దృష్టి సారించి రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి జయప్రద తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా జయప్రద ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం తరచూ మనం క్యాస్టింగ్ కౌచ్ అనే పేరును ఎక్కువగా వింటున్నాం కానీ మేము హీరోయిన్లుగా చేసే సమయంలో ఈ పదం అసలు వినపడేదే కాదని ఈమె తెలిపారు.ఇండస్ట్రీలో తమ పనులు తాము చూసుకొని వెళ్లిపోవడం వరకు మాత్రమే మాకు తెలుసని తెలిపారు. ఇక ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చాలా మంది సెలబ్రిటీలు చెబుతున్నారు.
Jayaprada: అవకాశాల కోసం కమిట్మెంట్లు ఇస్తున్నారు…
అవకాశాలు రావాలి అంటే మనలో టాలెంట్ ఉండాలని జయప్రద తెలిపారు. టాలెంటు ఉంటే అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయని ఈమె తెలియజేశారు.ప్రస్తుత కాలంలో ముంబైకి చెందినటువంటి ఎంతోమంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అయితే వీళ్లంతా అవకాశాల కోసం వీళ్లే డైరెక్టర్లకు నిర్మాతలకు కమిట్మెంట్లు ఇస్తూ వారి పక్కలోకి వెళ్తున్నారంటూ ఈమె ముంబై హీరోయిన్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.