Jeevitha – Rajasekhar: టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా గుర్తింపు పొందిన జీవిత రాజశేఖర్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఈ సీనియర్ దంపతులిద్దరూ చాలా కాలం క్రితం ఒకరినొకరు ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. అయితే వివాహం జరిగినప్పటినుండి ఇప్పటివరకు వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏ ఈవెంట్ కి వెళ్లిన కూడా జీవిత రాజశేఖర్ ఇద్దరు జంటగానే వెళ్తారు. అయితే జీవిత రాజశేఖర్ మధ్య ప్రేమ ఎలా పుట్టింది ? అసలు ఎవరు ముందుగా ప్రపోజ్ చేశారు? అన్న విషయాల గురించి తాజాగా జీవిత వెల్లడించింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జీవిత రాజశేఖర్ తో తన ప్రేమ ఎలా మొదలైందో తెలిపింది. ఈ ఇంటర్వ్యులో జీవిత మాట్లాడుతూ…” 1987లో వచ్చిన ‘తలంబ్రాలు’ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, షూటింగ్ సమయంలో పద్మాలయ స్టూడియోలోనే ఎక్కువ సమయం గడిపేవాళ్లం. అలా ఇద్దరం దగ్గరయ్యాం అంటూ జీవిత చెప్పుకొచ్చింది. ఆయన చాలా ఓపెన్ గా ఉంటారు. అది నాకు బాగా నచ్చుతుంది. పైగా అందంగానూ, ఎప్పుడూ నవ్వు ముఖంతో ఆకట్టుకునే వారు. ఆయన క్యారెక్టర్, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సరదాగా ఉంటారు. అతనిలో ఉన్న ఆ క్వాలిటీస్ నాకు బాగా నచ్చాయని తెలిపింది.
Jeevitha – Rajasekhar: ఏ విషయాన్ని దాచిపెట్టరు..
అయితే నేను తనని ఇష్టపడుతున్నట్లు తెలుసుకున్న రాజశేఖర్ వారి ఇంట్లో అస్సలు ఒప్పుకోరని, ఇంట్లో వాళ్లని ఎదురించి బయటికి రావడం తన వల్ల అయ్యే పనికాదని చెప్పాడు. ఆ తర్వాత కొంతకాలానికి అన్ని సర్దుకున్నాయని ఇంట్లో వారు పెళ్లికి అంగీకరించినట్లు రాజశేఖర్ చెప్పాడు. ఆ తర్వాత 1991లో ఇద్దరు వివాహం చేసుకున్నట్లు జీవిత వెల్లడించింది. ఇలా వీరిద్దరూ వివాహం చేసుకున్నప్పటినుండి ఇప్పటివరకు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఇప్పటికీ రాజశేఖర్ సినిమాలలో నటిస్తున్నాడు. ఇక వీరిద్దరు కుమార్తెలు కూడా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణిస్తున్నారు.