Jeevitha Rajasekhar: తెలుగు ప్రేక్షకులకు యాక్టర్ జీవిత గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తలంబ్రాలు చిత్రం ద్వారా సాగిన తన సినీ ప్రయాణం ఆపై ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులతో ఎనలేని ర్యాపో ను తన సొంతం చేసుకుంది. ఇక తన చివరి సినిమా తన భర్త రాజశేఖర్ అంకుశం సినిమాలో నటించి ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
మొత్తానికి జీవిత టాలీవుడ్ లో యాక్టర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక రాజశేఖర్ హీరోగా నటిస్తున్న శేఖర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఈ సినిమాకు జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహిస్తుంది. ఇక ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు శివాని ఒక మెయిన్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లో మరింత త్వరగా ప్రారంభిస్తున్నారు.
ఇక ఈ నెల 17న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభించారు. ఈ ఈవెంట్ లో యూట్యూబ్ నిఖిల్ ఒక రేంజ్ లో హడావిడి చేసాడు. స్టేజి మీద ఉన్న నిఖిల్ రాజశేఖర్ కూతురు శివాని, శివాత్మిక లను ఇరికించే విధంగా పలు ప్రశ్నలు అడిగాడు. ఇంట్లో ఎవరూ ఎక్కువగా అల్లరి చేస్తారు? ఎవరు ఎక్కువగా రెడీ అవుతారు అని అడిగాడు. ఇక రెడీ అవడానికి శివాని ఎక్కువ సమయం తీసుకుంటుందని జీవిత చెప్పుకొచ్చింది.

Jeevitha Rajasekhar: జీవిత తన కూతురు శివాని గుట్టు ఈ విధంగా బయటపెట్టింది !
ఇక ఎవరు ఎక్కువగా ఇరిటేట్ చేస్తారు అన్న ప్రశ్నకు జీవిత.. నేనే పిల్లలను ఎక్కువగా చిరాకు పెడతాను అని తెలిపింది. ఇక ఎక్కువగా ఖర్చు ఎవరు పెడతారు? అన్న ప్రశ్నకు ఇద్దరు ఫుడ్ కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు అని తెలిపింది. అంతేకాకుండా శివాని అయితే స్విగ్గీ వాళ్లపై గొడవలు పెట్టుకుంటుందని, ఇక కొంచెం ఆలస్యమైనా వాళ్ళకు డబ్బులు ఇవ్వదంటూ జీవిత శివాని గుట్టు రట్టు చేసింది.