Jhanvi Kapoor: అందాల నటి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వికపూర్. ఈమెని సినిమాల్లో చూసుకోవాలని శ్రీదేవి ఎంతగానో తపించింది. కానీ ఆ కోరిక తీరకుండానే కన్ను మూసింది. ఆమె ఆశయాన్ని తీర్చాలి అన్నట్లుగా జాన్వీ కపూర్ కూడా తన వంతు ప్రయత్నంతో వెండితెర మీద దూసుకుపోతుంది. శశాంక్ కవిత దర్శకత్వం వహించిన ధడక్ బాలీవుడ్ మూవీ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది జాన్వి.
తల్లి అందాన్ని, నటనని వారసత్వంగా తీసుకున్న ఈ ముద్దుగుమ్మ తల్లి హోదాతోనే వెండితెరపై దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో కూడా ఈమెకి ఫాలోవర్స్ కోట్లలోనే ఉన్నారు. ఇక ఈమెకి ప్రేమ కథలో నటించడం ఎక్కువగా ఇష్టమని తాజాగా ఓ వేదికగా చెప్పుకొచ్చింది ఈ బాలీవుడ్ భామ. ప్రేమకథా చిత్రాల్లో నటించడం వల్ల నేటి తరానికి చేరువ కాగలనని అన్నది.
అందరి హీరోయిన్ల లా మూసపాత్రలు చేయటానికి ఇష్టపడను అంటూ.. తన తల్లి కరీనాకపూర్ ల విభిన్న పాత్రల్లో నటించడానికి ఇష్టపడుతానని తెలిపింది. ఇక తను తీసుకున్న నిర్ణయాలలో ఎవరి ప్రమేయం ఉండదని అన్నది. కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి పెద్దగా రిస్క్ చేయలేము అని చాలామంది అపోహ పడతారని అన్నది.
అది అబద్ధం ఎందుకంటే కష్టపడకుండా ఏ విజయం అందుకోలేము అలా అందుకున్న విజయం చివరివరకు మనతో రాదంటూ చిన్న వయసులోనే మెచ్యూర్డ్ గా మాట్లాడుతుంది జాన్వీ కపూర్. ఇక తన ప్రతి కష్టంలోనూ తన ఫ్యామిలీ తన వెనుక నిలబడుతుందని తెలిపింది. కానీ రూమర్స్ విషయంలో మాత్రం ఒంటరిగానే ఎదుర్కొంటానని అన్నది. ఎందుకంటే తన సమస్యని వేరొకరు ఎదుర్కోవటం తనకు ఇష్టం లేదట. ముళ్ళబాటలో నడిస్తేనే ఎత్తు పల్లాలు తెలుస్తాయి అంటుంది ఈ భామ.
ఈ మధ్యనే ఒక నెటిజన్ నీకు యాక్టింగ్ రానప్పుడు ఎందుకు యాక్టింగ్ చేయటం, అనవసర ప్రయత్నం ఎందుకు చేస్తున్నావ్ అంటూ ప్రశ్నించాడంట కానీ నటనతోనే అతనికి సమాధానం చెప్పాలనుకుని రిప్లై ఇవ్వలేదట ఈ భామ. సెలబ్రిటీల గురించి ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు రాస్తున్నారు, ఇది అభ్యంతరకర విషయం ఉంటుంది జాన్వి.
Jhanvi Kapoor:
జయాపజయాలకు నేను అతీతం అని, ఫలితం ఎలాంటిదైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటానని, ఒక్క శాతం దురదృష్టం కూడా అంచనాల్ని తలకిందులు చేస్తుంది. ఇదే గుణం అమ్మకి కూడా ఉండేది ఈ విషయంలో నాకు తనే ఆదర్శం అంటుంది జాన్వి. ఖాళీ టైంలో ఏం చేస్తారు అని సరదాగా అడిగిన ప్రశ్నకు నేను కూడా అందరిలాంటి సాధారణ మనిషిని.
జిమ్ చేస్తాను, అందానికి మెరుగులు దిద్దుకుని ప్రయత్నం చేస్తాను, యాక్టింగ్ లో నన్ను నేను మెరుగుపరుచుకొని ప్రయత్నాలు చేస్తాను అన్నింటికన్నా ముఖ్యంగా కంటి నిండా నిద్రపోవడానికి ఇష్టపడతాను అంటూ చెప్పుకొచ్చింది శ్రీదేవి ముద్దుల తనయ. ఈమె వెండితెర మీద మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.