Jr NTR 30: టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇక ఇటీవల రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన ఎన్టీఆర్.. ఈ సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ నటించబోయే తదుపరి సినిమాల గురించి ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన బోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదలయ్యింది. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఉన్న టీజర్ కూడా విడుదల చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులలో సినిమా మీద భారీ అంచనాలు నెలకొనేలా చేసింది.
అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ అభిమానులను నిరాశ పరుస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు ? అన్న ప్రశ్నకు సమాధానం లేదు. అయితే తాజాగా ఎన్టీఆర్ 30 సినిమాలో ఇట్టకేలకు హీరోయిన్గా జాన్వీ కపూర్ నటించబోతోందని చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె అయిన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి బాలీవుడ్ సినిమాలలో నటిస్తోంది. ఇప్పటివరకు బాలీవుడ్లో ఎన్నో సినిమాలలో నటించిన జాన్వీ కపూర్ మొట్ట మొదటి సారిగా ఎన్టీఆర్ 30 సినిమా ద్వారా టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది.
Jr NTR 30: ఎన్టీఆర్ తో నటించడానికి ఎదురుచూస్తున్న..
ఇందులో ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా కనిపించనుందని చిత్ర బృందం ప్రకటించింది. అంతే కాకుండా ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని సైతం షేర్ చేసింది. ఈ క్రమంలో చాలాకాలంగా ఎన్టీఆర్ తో కలిసి నటించాలని ఆశపడిన జాహ్నవి కపూర్ కల ఇప్పటికీ నెరవేరింది. ఈ మేరకు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంపై జాన్వి సంతోషాన్ని వ్యక్తం చేసింది. ”ఎట్టకేలకు ఇది జరుగుతోంది. నేను ఎంతగానో అభిమానించే ఎన్టీఆర్‌తో కలిసి సందడి చేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా” అని ఆమె తెలిపింది. ఇక ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఆస్కార్ అవార్డ్స్ తర్వాత రెగ్యులర్ షూటింగ్ ఉండబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో కాలంగా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.