Jr NTR: తెలుగు ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి నటనలో తాత స్థాయికి ఎదిగాడు. ఓకే సీన్ లో అన్ని ఎమోషన్స్ పండించగల దిట్ట ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకున్నాడు.
ఇక ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ చిత్రం ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా హడావిడి చేస్తున్నాడు. ఈ క్రేజ్ తో చేతి నిండా సినిమాలతో ఒక రేంజ్ లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. కాగా ఎన్టీఆర్ 30వ చిత్రం మొదలుపెట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు.
వసుంధర ఆర్ట్స్, ఎన్టీఅర్ ఆర్ట్స్ కలబోసి నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ మ్యూజికల్స్ తోడయ్యాయి. ఇక రత్నవేలు కెమెరా మెన్ గా బాధ్యతలు చేపట్టాడు. గత రెండు రోజుల క్రితం ఈ సినిమాలో చేసే టెక్నీషియన్స్ గురించి ఆప్ డేట్ ఇచ్చారు. కానీ ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ పేరు మాత్రం బయట పెట్టలేదు.

Jr NTR: ఎన్టీఆర్ సినిమాను వదులుకున్న ఆ బాలీవుడ్ బ్యూటీ ఈమెనే!
ఇక కొరటాల శివ ఈ సినిమాలో ఎన్టీఆర్ కు తగిన జోడీ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తుంది. ఆ మధ్య ఆలియా భట్ ను ఈ సినిమాలో హీరోయిన్ అనుకున్నట్లు వార్తలు వినిపించాయి. గత కొన్ని రోజులుగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ని కూడా ఊహించుకుంటున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ కొరటాల శివ బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకునేను సంప్రదించినట్లు తెలుస్తోంది.
కానీ ఈ అమ్మడు నటించడానికి తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్తల వెనుక నిజం ఎంత ఉందో.. అబద్ధం ఎంత ఉందో తెలియాలి అంటే వేచి ఉండాల్సి ఉంది. కాగా ఈ వార్తల గురించి డైరెక్టర్ కొరటాల శివ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.