Jr NTR: నందమూరి వారసుడి ఇండస్ట్రీలోకి బాలేనటుడిగా అడుగుపెట్టి, అనంతరం హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందారు.ఈయన చేసే సినిమాలన్నీ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే చాలామంది వారసులు ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాలేక ఇతర వ్యాపార రంగాలలో స్థిరపడుతున్నారు.మరి ఎన్టీఆర్ ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోయినా ఉంటే ఏ వ్యాపారంలో స్థిరపడేవారు ఎక్కడ ఉండేవారు అనే విషయం గురించి గతంలో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ కి సినిమా ఇండస్ట్రీలో కనుక సక్సెస్ రాకపోయి ఉంటే ఆయన హీరోగా కాకుండా ఇండస్ట్రీలోనే ఏదో ఒక పని చేసుకుంటూ కొనసాగుతూ ఉండేవాడినని తెలియజేశారు.
Jr NTR: ఇండస్ట్రీలోనే చిన్న పని చేసే వాడిని..
తనకు సినిమాలంటేనే పిచ్చి సినిమా తప్ప నాకు ఏ ప్రపంచం తెలియదని ఎన్టీఆర్ తెలియజేశారు. అందుకే సినిమాల కోసం తాను ఎంతైనా కష్టపడతానని,ఒకవేళ ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోయి ఉంటే ఇక్కడే ఏదో ఒక చిన్న పని చేసుకుంటూ ఇండస్ట్రీలోనే కొనసాగే వాడిని తప్ప ఇండస్ట్రీని వదిలేసి బయటకు వెళ్లే వాడిని కాదు అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ కనుక చూస్తే ఎన్టీఆర్ కు సినిమాలు అంటే ఎంత పిచ్చి ఉందో అర్థం అవుతుంది. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.