JR NTR: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్నాడు. కేవలం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులనే కాకుండా.. వరల్డ్ లోనే తన నటనతో మెప్పించాడు. అందులో కొమరం భీమ్ పాత్రతో బాగా అదరగొట్టాడు ఎన్టీఆర్. ఇక ఇప్పటికే ఈ సినిమాకు చాలా అవార్డులు వచ్చాయి. ఇటీవలే నాటు నాటు పాటకు గోల్డ్ గ్లోబెల్ అవార్డు కూడా వచ్చింది. అయితే తాజాగా ఎన్టీఆర్ కు మరో అరుదైన గుర్తింపు రానున్నట్లు తెలుస్తుంది.
మరో నాలుగు రోజుల్లో ఆస్కార్ నామినేషన్ ప్రకటించనున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా నలుమూలల వారికి ఈ ఆస్కార్ నామినేషన్స్ పై బాగా ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా భారతీయులకు మాత్రం మరింత ఆసక్తి ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఆస్కార్లో ఆర్ఆర్ఆర్ సినిమా అనౌన్స్మెంట్ ఉంది కాబట్టి. అమెరికాకు చెందిన ‘యుఎస్ఏ టుడే’ పత్రిక తాజాగా పదిమంది నటులను ఆస్కార్ కమిటీ పరిగణలలోకి తీసుకోవాలని కోరుతూ ఒక ఐటమ్ ను ప్రచురించింది.
ఇందులో ఆర్ఆర్ఆర్ సినిమా తరపున నుంచి కొమరం భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్ కు కూడా ఈ అరుదైన గౌరవం చోటు చేసుకుంది. ఎప్పుడైతే ఎన్టీఆర్ పేరు ప్రకటించారు అప్పటినుంచి తెలుగు ప్రేక్షకులలో మాత్రం మరింత ఆసక్తి పెరిగింది. ఇక ఇందులో ఎన్టీఆర్ తో పాటు మరికొంతమంది నటులు కూడా ఉన్నారు. ఇక వాళ్ళు ఎవరంటే టాప్ గన్: మేవరిక్ ద్వారా గుర్తింపు పొందిన హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్, ద బ్యాట్మెన్ సినిమా ద్వారా గుర్తింపు పొందిన పాల్ డేనో, ఆఫ్టర్ సన్ సినిమాతో గుర్తింపు పొందిన పాల్ మెస్కల్, ది ఇన్స్పెక్షన్ తో గుర్తింపు పొందిన జెరేమి పోప్ ఉన్నారు.
JR NTR:
ఇక నటిమణులలో పెరల్ సినిమాతో గుర్తింపు పొందిన మియాగోత్, టార్ సినిమాతో నినా హాజ్, కిమి సినిమాతో జో క్రెవిట్జ్, ది వుమెన్ కింగ్, మెటల్డా ద మ్యూజికల్ తో గుర్తింపు పొందిన లషనా లించ్, నోప్ సినిమాతో గుర్తింపు పొందిన కేకే పామర్ ఉన్నారు. అయితేఈ పదిమందిలో ఆస్కార్ నామినేషన్ ఎవరు అందుకుంటారో తెలియదు కానీ.. ఇందులో వీరు పేర్లతో పాటు ఎన్టీఆర్ పేరు కూడా ఉండటంతో భారతీయ ప్రజలలో బాగా ఆశలు రేపుతున్నాయి. ఇక ఈ నామినేషన్స్ జనవరి 25న తెల్లవారుజామున ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ కి ఈ గౌరవం దక్కుతే మాత్రం అభిమానులతో పాటు భారతీయులకు గొప్ప శుభవార్త అని చెప్పాలి.