Jr Ntr: నందమూరి కుటుంబం నుండి హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తారకరత్న గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న తారకరత్న నేడు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ యువగలం పాదయాత్ర మొదలుపెట్టడంతో నందమూరి తారకరత్న నారా లోకేష్ తో కలిసి ఆ పాదయాత్రలో పాల్గొన్నాడు. ఈ పాదయాత్రలో భాగంగా కుప్పం మసీదులో ప్రార్థనలు నిర్వహించి బయటకు వస్తుండగా.. అకస్మాత్తుగా తారకరత్న స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆయనను వెంటనే కుప్పం కేసీ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ ప్రథమ చికిత్స చేసిన వైద్యులు ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనను పరీక్షించి గుండెపోటు రావడం వల్లే ఇలా జరిగిందని వెల్లడించారు. తారకరత్నకు అన్ని పరీక్షలో నిర్వహించిన వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్ట్ నిర్వహించారు. గుండెపోటు రావడం వల్ల తారకరత్న స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత ఆయన శరీరం నీలంగా మారి, 45 నిమిషాల పాటు పల్స్ పడిపోయిందని వైద్యులు వెల్లడించారు. అయితే వైద్యులు ఆయనకు యాంజీయోప్లాస్ట్ నిర్వహించారు. మెరుగైన చికిత్స కోసం ఆయనని బెంగళూరుకు తరలించనున్నారు.
Jr Ntr: బెంగళూరుకు తారకరత్న…
తాజాగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి జూనియర్ ఎన్టీఆర్ ఆరా తీశారు. నందమూరి తారకరత్న అనారోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీయటానికి బాలకృష్ణకు ఫోన్ చేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అతని ఆరోగ్యం గురించి చింతించాల్సిన అవసరం లేదని బాలకృష్ణ ఎన్టీఆర్ కి వివరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తారకరత్న వద్దకు వెళ్లి పరామర్శించలేని స్థితిలో ఉండటం వల్ల ఇలా బాలకృష్ణకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నట్లు సమాచారం. మరి కాసేపట్లో తారకరత్నను బెంగళూరుకు తరలించనున్నారు.