Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRRసినిమా తర్వాత ఇప్పటివరకు ఒక్క సినిమా షూటింగ్లో కూడా పాల్గొనలేదు అయితే ఈయనతో పాటు కలిసిన నటించిన రామ్ చరణ్ మాత్రం వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు.ఎన్టీఆర్ రాజమౌళి సినిమా తర్వాత డైరెక్టర్ కొరటాల శివ సినిమాను ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించలేదు దీంతో ఎన్టీఆర్ అభిమానులు కాస్త ఆసహనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ 30 గురించి అప్డేట్ కావాలి అంటూ పదే పదే కొరటాల ఎన్టీఆర్ సినిమా గురించి అభిమానులు ప్రశ్నిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్ తన అన్నయ్య కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది తారక్ అభిమానులు ఎన్టీఆర్ 30 గురించి అప్డేట్ ఇవ్వాలి అంటూ గోల చేశారు.అయితే యాంకర్ సుమ కూడా ఇదే విషయాన్ని ఎన్టీఆర్ ముందుకు తీసుకు రావడంతో ఒక్కసారిగా ఎన్టీఆర్ యాంకర్ సుమ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ చాలా సీరియస్ లుక్ ఇచ్చారు. ఇలా సుమపై సీరియస్ అయినటువంటి తారక్ ఎట్టకేలకు మైక్ తీసుకొని వారు అడగకపోయినా మీరు చెప్పించేసేలా ఉన్నారే అంటూ సీరియస్ అయ్యారు.
Jr.NTR: అభిమానులే మాకు ఎక్కువ…
అనంతరం ఎన్టీఆర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ 30అప్డేట్ మాత్రమే కాదు ఏ హీరో సినిమా అప్డేట్ అయినా మీరు అడగకముందే మేము ఈ విషయాలను బయటపెడతాము. అదేదో మేము కావాలని దాచుకున్నట్లు అప్డేట్ కావాలి అంటూ అడగడంతో అది దర్శక నిర్మాతలపై చాలా ఒత్తిడి తీసుకువస్తుందని తెలిపారు.ఇలాంటి విషయాలలో మాకు మా కుటుంబ సభ్యుల కన్నా అభిమానులే ఎక్కువ ఇలాంటి విషయాలు మేము మా భార్యల కన్నా ముందుగా అభిమానులతోనే చెబుతామంటూ ఎన్టీఆర్ ఈ సందర్భంగా అభిమానులకు తనదైన శైలిలో స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.