Jr.NTR: సాధారణంగా సినిమా సెలబ్రిటీలు వారి స్థాయికి తగ్గట్టు విలువైన దుస్తులు వస్తువులు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే హీరో హీరోయిన్లు ధరించి దుస్తులు వస్తువులు కార్లు బైకుల వంటి వాటి గురించి వాటి ధరల గురించి ఎప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా మన టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి హీరోలు ధరించే దుస్తుల గురించి వాటి ధరల గురించి వార్తలు వస్తుంటాయి. కానీ తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ధరించిన వాచ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఎన్టీఆర్ ఇండస్ట్రీలోని దర్శక నిర్మాతలను ఆహ్వానించి ఒక పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో రాజమౌళి, కొరటాల శివ, దిల్ రాజు వంటి ప్రముఖ దర్శకనిర్మాతలు సందడి చేశారు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ పార్టీలో ఎన్టీఆర్ ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఎన్టీఆర్ ధరించిన ఆ వాచ్ ఖరీదు గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఆ వాచ్ ధర గురించి తెలుసుకున్న నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
Jr.NTR: ఎన్టీఆర్ రేంజ్ మామూలుగా లేదు…
ఇటీవల నిర్వహించిన పార్టీలో ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఖరీదు గురించి తెలుసుకోవటానికి అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ఆ వాచ్ ఖరీదు అక్షరాల రూ. 8 కోట్లు అని తెలియగానే అందరూ ఆశ్చర్యంతో నూరేళ్లపెట్టారు. దీంతో ఎన్టీఆర్ ధరించిన వాచ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ తన రేంజ్ కి సరిపోయే వాచ్ ని ధరించాడంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు ఎన్టీఆర్ రేంజే వేరు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఎన్టీఆర్ ఎంతో బిజీగా గడుపుతున్నారు.