Jr NTR: ఆస్కార్ వేడుకల కోసం అమెరికా వెళ్ళినటువంటి RRR చిత్ర బృందం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సందడి చేశారు. ఇలా ఎన్టీఆర్ అమెరికా నుంచి తిరిగి రావడంతో పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు అభిమానులు ఎయిర్ పోర్ట్ వద్దకు చేరుకుని సందడి చేశారు ఇక అభిమానులు ఎన్టీఆర్ ని చూడగానే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశిస్తూ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా తమ సినిమాకు ఇంత మంచి ఆదరణ రావడానికి కారణం అభిమానులేనని తెలియజేశారు.ఇక ఆస్కార్ వేడుక గురించి మాట్లాడుతూ నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు ప్రకటించగానే తనకు ఎంతో సంతోషం వేసిందని ఆ క్షణం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిది అంటూ ఎన్టీఆర్ తెలియజేశారు. ఇలా ఆర్ఆర్ టీం కు ఆస్కార్ అందించిన ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోలేనిదని తెలిపారు.ఇక ఆస్కార్ అవార్డును రాజమౌళి చేతిలో చూసినప్పుడు తనకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయని ఎన్టీఆర్ తెలియచేశారు.
Jr NTR: ప్రణతికి ఫస్ట్ ఈ విషయాన్ని చెప్పాను
ఈ సినిమాకు గాను ఆస్కార్ ప్రకటన రాగానే సంతోషంతో తాను ఈ విషయాన్ని ముందుగా తన ఫ్యామిలీ మెంబర్స్ తన వైఫ్ ప్రణతికి ఫోన్ చేసి చెప్పానని ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలియజేశారు.ఇలా నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో తనకు మరింత బాధ్యత పెరిగిందని ఈయన వెల్లడించారు. ఈ పాటకు కొరియోగ్రఫీ చేసినటువంటి ప్రేమ్ రక్షిత్ కూడా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తాను కొరియోగ్రఫీ చేసినటువంటి ఈ పాట అంతర్జాతీయ ఆస్కార్ వేదికపై పర్ఫామెన్స్ చేయడం తాను జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని ఈ సందర్భంగా కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ తన సంతోషాన్ని తెలియజేశారు.