Jr.NTR: రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు ఎన్నో అవార్డులు వరించాయి. ఇక ఇటీవల హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల కార్యక్రమంలో కూడా ఆర్ఆర్ఆర్ సినిమాకి అవార్డులు దక్కాయి. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కీలక పాత్రలలో నటించగా. ఈ అవార్డు కార్యక్రమానికి మాత్రం రామ్ చరణ్ ఒక్కరే హాజరు అయ్యారు. ఈ అవార్డు ప్రధానోత్సవంలో రామ్ చరణ్ అవార్డు అందుకోవడమే కాకుండా … రామ్ చరణ్ చేతుల మీదుగా కొన్ని అవార్డుల అందజేయడం కూడా హాట్ టాపిక్ అయింది. దీంతో ఇది రామ్ చరణ్ ఘనత అన్నట్లుగా రామ్ చరణ్ మీద ప్రశంసల వర్షం కురిపించారు.
దీంతో జూనియర్ ఎన్టీఆర్ ను కావాలనే దూరం పెట్టి రామ్ చరణ్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు అంటూ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. ఇదే విషయం మీద తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ మెంబర్ ను కూడా ట్యాగ్ చేస్తూ ఇదంతా మెగా పెయిడ్ మాఫియా చేస్తున్న వ్యవహారం అంటూ ట్రోల్ చేస్తున్నారు. హెచ్సీఏ మెంబర్ మోనిక రామ్ చరణ్ తో ఫోటో దిగి సంబరపడుతూ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు ఆమెను టార్గెట్ చేస్తూ పెయిడ్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు అంటూ మండిపడుతున్నారు. దీంతో ఆమె స్పందిస్తూ.. తాను ఎవరిని ప్రమోట్ చేయడం లేదని కేవలం ఆర్ఆర్ఆర్ పై ప్రేమ, రామ్ చరణ్ మీద ఉన్న అభిమానం వల్ల మాత్రమే ఇలా ఫోటోలు షేర్ చేశానని క్లారిటీ ఇచ్చింది.
Jr.NTR: షూటింగ్లో బిజీగా తారక్…
ఇక ఈ విషయం పై హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ కూడా స్పందించింది. ఈ క్రమంలో తాము జూనియర్ ఎన్టీఆర్ ని ఈ వేడుకకు పిలిచామని చెబుతూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ” ఆయన ప్రస్తుతానికి ఇండియాలో ఒక సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారని అందుకే ఆయన ఈ అవార్డులు వేడుకకు రాలేకపోయారని పేర్కొంది. మా నుంచి ఆయనకు అందాల్సిన అవార్డు త్వరలోనే ఆయనకి అందుతుందని” హెచ్సీఏ ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. కానీ ఎన్టీఆర్ ఇప్పుడు ఎలాంటి సినిమా షూటింగ్ చేయడం లేదనే విషయం తెలిసిన తెలుగు అభిమానులు మాత్రం హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ మీద మండిపడుతున్నారు. ఈ వివాదం ఎప్పుడూ సర్డుమనుగుతుందో చూడాలి మరి.