Jr. NTR: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన RRR సినిమా ద్వారా ఈయన గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పాలి.ఇలా ఈ సినిమా తర్వాత వరుస సినిమాలకు కమిట్ అయిన ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా మారిపోయారు.ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా షూటింగ్ పనులలో బిజీగా మారనున్నారు.
ఇకపోతే తాజాగా ఎన్టీఆర్ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నటిస్తున్నటువంటి వార్ 2సినిమాలో కూడా కీలకపాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కు అనుగుణంగా స్క్రిప్ట్ లో కూడా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.హృతిక్ రోషన్ తో సమానంగా ఈయనకు స్క్రీన్ స్పేస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మేకర్స్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారట.ఇలా హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఎన్టీఆర్ కు రావడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Jr. NTR: భారీగా పెరిగిన తారక్ రెమ్యునరేషన్..
ఇక వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా మరో లెవెల్ లో ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తీసుకునే రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. RRRసినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఈయనకు రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెరిగిందని తెలుస్తుంది.హృతిక్ రోషన్ సినిమాలో కీలక పాత్రలో నటించడం కోసం ఎన్టీఆర్ ఏకంగా 75 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని సమాచారం. ఈయనకు ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా యశ్ రాజ్ ఫిలిమ్స్ ముందుకు వచ్చారని తెలుస్తోంది. ఇలా ఈయన రెమ్యూనరేషన్ తెలిసినటువంటి నెటిజన్స్ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.