Jr Ntr : ఎన్టీఆర్ ఇంటి ధర ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Akashavani

Jr Ntr : తెలుగు ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి నటనలో తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నాడు. కోపం, ప్రేమ, బాధ ఇలా అన్నిటినీ ఓకే షార్ట్ లో పండించడం ఎన్టీఆర్ ప్రత్యేకత అని చెప్పవచ్చు.

మొత్తానికి ఎన్టీఆర్ టాలీవుడ్ స్టార్ హీరోల లో తాను ఒకడిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక ఇటీవల రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. తన అద్భుతమైన నటనకు బీ టౌన్ ప్రేక్షకులు మరింత ఫిదా అయ్యారు. ఇక పాన్ ఇండియా స్థాయిలో మంచి ర్యాపో పెంచుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.

ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏరియా లో ఒక విశాలమైన ఇల్లు ను కొనుగోలు చేశాడు. ఇక ఇదే ఇంటితో పాటు బెంగళూరు, కర్ణాటక లో మరి కొన్ని విశాలమైన గృహాలు కొన్నట్లు తెలుస్తోంది. ఇక ఇంట్లో సదుపాయాల విషయంలో ఏ మాత్రం తగ్గకుండా ఎన్టీఆర్ ఫ్యామిలీ కి సౌకర్యంగా ఉండేలా ఎన్టీఆర్ ఆ ఇళ్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.

 Jr Ntr : ఎన్టీఆర్ ఇంటి ధర ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. వైరల్ అవుతున్న ఫోటోలు!
 Jr Ntr : ఎన్టీఆర్ ఇంటి ధర ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Jr NTR: ఎన్టీఆర్ కొనుగోలు చేసిన ఇల్లు విలువ ఇన్ని కోట్లు!

ఇలా అన్ని సౌకర్యాలు ఉండి.. ఖరీదైన ఇల్లు కొనడాన్ని తారక్ తన డ్రీమ్ భావిస్తాడని తెలుస్తుంది. ఇక జూబ్లీహిల్స్ లో ఎన్టీఆర్ కొనుగోలు చేసిన ఇంటిని తనకు ఇష్టమైన విధంగా డిజైన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ బంగ్లా విలువ దాదాపు 25 కోట్లు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఆ ఇంటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇక ఎన్టీఆర్ 31 అనే ప్రాజెక్టుతో జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాగా ఈ సినిమాకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు.

- Advertisement -