Jr NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడంతో ఎన్టీఆర్ క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో భారీగా పెరిగిపోయిందని చెప్పాలి. ఇకపోతే ఆస్కార్ వేడుకలను ముగించుకొని ఇండియాకి వచ్చిన ఎన్టీఆర్ తాజాగా విశ్వక్ హీరోగా నటించిన దాస్ కా ధమ్కీ సినిమా ఈనెల 22వ తేదీ విడుదల కాబోతుండడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు. తాను హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలో ఒకే చక్రంలో ఇరుక్కుపోయానన్న అనుభూతి తనకు కలిగింది. ఈ క్రమంలోనే మీరు (అభిమానులు) కాలర్ ఎగరేసేలా చేస్తానని మాట ఇచ్చాను. ఆ దిశగానే విభిన్నమైన కథలను ఎంపిక చేసుకొని సినిమాలలో నటిస్తున్నానని ఎన్టీఆర్ తెలియజేశారు.అలాగే విశ్వక్ కూడా విభిన్న కథ చిత్రాలను ఎంపిక చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని ఆయన సినిమాను కూడా మీరు తప్పకుండా ఆదరించాలని తెలిపారు.
Jr NTR:
ఇకపోతే ఈ సినిమాకు విశ్వక్ దర్శకత్వం వహించడం విశేషం. ఈ విషయం గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ ఈ సినిమా తర్వాత విశ్వక్ దర్శకత్వం వహించడం మానేయాలి ఎందుకంటే మీలాంటి యువ హీరోలు కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వాలి అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ విశ్వక్ సేన్ కి సలహా ఇచ్చారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ పటంలో ఆల్ టైం టాప్ పొజిషన్లో ఉందని ఈయన తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రస్తుతం ప్రపంచ పటంలో నిలబడి ఆస్కార్ అవార్డు అందుకుంది అంటే ఈ సినిమాకు పని చేసిన చిత్ర బృందంతో పాటు ఈ సినిమాని ఎంతగానో ఆదరించిన ప్రేక్షక దేవుల్లే కారణమని, ఈ సినిమాకు చంద్రబోస్ కీరవాణి ఆస్కార్ తీసుకుంటుంటే నాకు అక్కడ వారు కనిపించలేదని ఇద్దరు భారతీయులు మాత్రమే కనిపించారంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ కామెంట్ చేశారు.