K. Vishwanath Wife: టాలీవుడ్ లెజెండరీ దివంగత డైరెక్టర్ కె విశ్వనాథ్ ఇంట మరొక విషాదం చోటుచేసుకుంది. కళాతపస్వి విశ్వనాధ్ గారు ఈ నెల రెండవ తేదీన అనారోగ్య సమస్యలతో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మరణించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన మరణ వార్త మర్చిపోకముందే ఆయన సతీమణి జయలక్ష్మి కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం ఉన్నఫలంగా ఈమె తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు.
ఇలా అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయి చికిత్స తీసుకుంటున్న కొంత సమయానికే జయలక్ష్మి కన్నుమూశారు. అయితే ఈనెల రెండవ తేదీ కళాతపస్వికే విశ్వనాథ గారు మరణించడం అందరినీ ఎంతగానో కలిసి వేసింది. అయితే ఈయన మరణం తర్వాత కేవలం 24 రోజుల వ్యవధిలోనే తన భార్య కూడా మరణించడంతో విశ్వనాథ్ కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
తీవ్ర అస్వస్థతకు గురైన జయలక్ష్మి…
ఇక విశ్వనాథ గారు అతి చిన్న వయసులోనే జయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు ముగ్గురు సంతానం ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు. దర్శకుడుగా విశ్వనాధ్ గారు ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ ఈయన వారసులు ఎవరు కూడా ఇండస్ట్రీలోకి రాకపోవడం గమనార్హం. అయితే పిల్లలకు ఇండస్ట్రీపై ఆసక్తి లేకపోవడం వల్లే వారికి ఆసక్తి ఉన్నటువంటి రంగంలో వారు స్థిరపడ్డారు. ఇలా కొద్దిరోజుల వ్యవధిలోనే విశ్వనాథ్ గారి దంపతులు మరణించడంతో పలువురు సినీ సెలబ్రిటీలు జయలక్ష్మి గారి మరణం పై స్పందిస్తూ సంతాపం ప్రకటిస్తున్నారు.