Kajal Agarwal: లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భామ కాజల్ అగర్వాల్. ఆ తర్వాత చందమామ సినిమాలో తన అందంతోను, నటనతోను ప్రేక్షకుల దృష్టిని తన వైపు తిప్పుకుంది. 2009లో విడుదలైన మగధీర సినిమా ఆమె కెరియర్ ని మరో లెవెల్ కి తీసుకు వెళ్ళింది.
సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ తో పాటు పలు వేడుకల్లో ఆమె ఉత్తమ నటి నామినేషన్ పొందింది. ఇక పెళ్లి చేసుకుని సినిమాలకు గ్యాప్ ఇచ్చింది ఈ భామ. ఆ మధ్యనే పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. అయితే ఇదంతా పక్కన పెడితే. ఇప్పుడు ఈమె చేసిన ట్వీట్ మెగా అభిమానులని కలవరపెడుతోంది. అసలు విషయం ఏంటంటే.. తాజాగా మన ఆర్ఆర్ఆర్ మూవీ నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే.
ఇక ప్రపంచం మొత్తం ఆర్ఆర్ఆర్ టీం కి ప్రశంసల వర్షం కురిపించారు. ఎందరో సెలబ్రెటీలు వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు, మెసేజ్లు పంపించారు. ఈ సందర్భంగా కాజల్ కూడా ఒక పోస్ట్ పంచుకుంది. ఇక అందులో జూనియర్ ఎన్టీఆర్ ట్రోఫీ పట్టుకున్న పిక్ ని మాత్రమే రీట్వీట్ చేస్తూ బిగ్ కంగ్రాట్యులేషన్స్ అంటూ మెసేజ్ పెట్టింది. ఇదే ఇప్పుడు మెగా అభిమానుల కోపానికి కారణమైంది.
మగధీర సినిమా ద్వారా తన కెరీర్ హిట్ ఇచ్చిన టీం కి ఈ విధంగానా విషెస్ తెలపటం అంటూ కాజల్ మీద తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు మెగా అభిమానులు. మరో త్రెడ్ లో టీం సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ అందర్నీ ట్యాగ్ చేసింది. అయితే అక్కడ ఎలాంటి ఫోటోని జత చేయకపోవడం అందరికీ నిరాశ కలిగించింది. అయితే ఇందుకు ఒక కారణం ఉంది అంటున్నారు కొందరు. ఈమె ఆచార్య సినిమాలో చిరంజీవి పక్కన నటించింది.
Kajal Agarwal
ఆమె మీద ఒక పాటను కూడా షూట్ చేశారు. తీరా సినిమా రిలీజ్ అయ్యే సమయానికి ఆమె క్యారెక్టర్ మొత్తం ఎగిరిపోయింది. ఈ సినిమాకి రామ్ చరణ్ కూడా ఒక ప్రొడ్యూసర్. అందుకే ఈ భామ రామ్ చరణ్ మీద అలిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజం ఎంత ఉందనేది కాజల్ ఇచ్చే రీ ట్వీట్ పైన ఆధారపడి ఉంటుంది. ఇక ఈమె ఇండియన్ టు సినిమా ద్వారా మళ్ళీ మనందరినీ అలరించబోతున్నట్లుగా సమాచారం.