Kajal Aggarwal: వెండితెర చందమామగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకొని తెలుగు తమిళ హిందీ భాషా చిత్రాలలో నటిస్తూ ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగినటువంటి కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా బాబుకు జన్మనిచ్చిన తర్వాత ఈమె సినిమాలకు దూరంగా ఉండబోతున్నారంటూ కాజల్ గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.
ఇలా ఈ వార్తలన్నీ కూడా ఆ వాస్తవమే అంటూ ఈమె భగవంత్ కేసరి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా మరో సినిమాకి కూడా ఈమె కమిట్ అయ్యారు.కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి కాజల్ సినిమాల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని. ఇకపై తాను సినిమాలు చేయాలి అంటే దర్శక నిర్మాతలు తాను పెట్టే ఈ కండిషన్ కి ఒప్పుకుంటేనే సినిమాలలో నటిస్తానని ఈమె తెలియజేస్తున్నారట. కాజల్ తల్లి అయిన తర్వాత సినిమాలలో నటించాలి అంటే తన భర్త తనకు ఒక కండిషన్ పెట్టారని తెలుస్తుంది.
Kajal Aggarwal: గ్లామర్ షో కి దూరంగా కాజల్…
తల్లి అయిన తర్వాత సినిమాలలో నటించాలి అంటే ఎలాంటి గ్లామర్ షో కి తావు లేకుండా సినిమాలలో చేయమని తన భర్త గౌతం తనకు చెప్పారట. దీంతో గౌతమ్ సూచనల మేరకే కాజల్ కూడా సినిమాలలో గ్లామర్ షో చేయడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు ఇలా తాను నటించే సినిమాలలో గ్లామర్ షో చేయనని దర్శక నిర్మాతలకు ముందుగానే ఈమె చెబుతున్నట్టు తెలుస్తుంది. ఇలా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి కొంతకాలం పాటు ఇండస్ట్రీలో ఉండాలి అంటే గ్లామర్ షో తప్పనిసరి అలాంటిది కాజల్ దూరంగా ఉండబోతున్నారు అంటే ముందు ముందు ఈమె కెరియర్ ఇబ్బందులలో ఉన్నట్టేనని పలువురు భావిస్తున్నారు.