Kajal: సినీనటి కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరి సరసన నటించిన ఈమె ఎన్నో సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇకపోతే కాజల్ రామ్ చరణ్ గురించి తాజాగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ తో కలిసి మగధీర, గోవిందుడు అందరివాడే వంటి సినిమాలలో నటించారు.
ఈ క్రమంలోనే రాంచరణ్ తో ఈ సినిమాలలో నటించిన కాజల్ తనకు అవకాశం వస్తే రాంచరణ్ ను చంపేస్తాను అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఈ విధంగా కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ నుఎందుకు చంపేస్తాను అంటూ మాట్లాడారు అనే విషయానికి వస్తే.. గతంలో ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తనకు రాపిడ్ ఫెయిర్ క్వశన్స్ ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు ఈమె సమాధానాలు చెబుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Kajal: మండిపడుతున్న చరణ్ ఫ్యాన్స్…
ఇందులో భాగంగా టాలీవుడ్ హీరోల గురించి ఈమెను ప్రశ్నిస్తూ మీరు ఒకవేళ చంపాలనుకుంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరిని చంపాలనుకుంటారు అలాగే ఎవరితో లేచిపోతారు ఎవరిని పెళ్లి చేసుకుంటారు అంటూ వరుసగా ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు కాజల్ సమాధానం చెబుతూ ఎన్టీఆర్ తో లేచిపోయి ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటాను.ఇక తనకు చంపే అవకాశం వస్తే తాను రామ్ చరణ్ ను చంపేస్తాను అంటూ ఈ సందర్భంగా కాజల్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా ఈమె సరదాగా రామ్ చరణ్ ను చంపేస్తాను అంటూ సమాధానం చెప్పినప్పటికీ రాంచరణ్ అభిమానులు మాత్రం ఈ విషయంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.