Kajol Devgan సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎలాగైనా ఒక్క అవకాశం దక్కించుకొని నిలుదొక్కుకుంటే చాలు జీవితాంతం స్తార్డం మరియు హోదా వంటివి కచ్చితంగా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఎంతోమంది హీరో హీరోయిన్లు లేదా ఇతర నటీనటులు వయసు మీద పడిన తర్వాత కూడా ఏదో ఒక రూపంలో ప్రేక్షకులను అలరిస్తూ లక్షలు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇక ఈ క్రమంలో కొంతమంది సినీ సెలబ్రిటీలు పలు రకాల షోలు ఈవెంట్లు అలాగే రియాలిటీ షోలు అంటూ బాగానే సంపాదిస్తున్నారు.
కాగా బాలీవుడ్ లో దిల్వాలే దుల్హనా లేజాయేంగే చిత్రం ద్వారా సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అంటూ తేడా లేకుండా అన్ని భాషల ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ బ్యూటిఫుల్ హీరోయిన్ కాజోల్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు ఒకప్పుడు బాలీవుడ్ లో ఉన్నటువంటి దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్ గా ప్రేక్షకులని బాగానే మెప్పించింది. ఈ క్రమంలో పెళ్లయిన తర్వాత కూడా కొంతకాలం పాటు సినిమాల్లో కొనసాగింది. కానీ సంతానం కలిగిన తర్వాత నటనకి బ్రేక్ ఇచ్చి తన కుటుంబ బాధ్యతలను చక్కబట్టే పనిలో పడింది. అలాగే తన భర్త అజయ్ దేవ్గన్ ఉన్నటువంటి పలు వ్యాపారాలను కూడా చూసుకుంటుంది.
కాగా ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నటి కాజోల్ ప్రస్తుతం ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క రియాల్టీ గేమ్ షోపై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. అయితే తాజాగా నటి కాజోల్ ప్రముఖ ఓటీపీ సంస్థ ఆయన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో ఓ రియాల్టీ గేమ్ షోకి హోస్ట్ గా వ్యవహరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఒక్కో ఎపిసోడ్ కి దాదాపుగా 5 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని బాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అలాగే ప్రస్తుతం నటి కాజోల్ కి ఉన్నటువంటి క్రేజీ నీ దృష్టిలో ఉంచుకొని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ ఈ భారీ మొత్తం రెమ్యూనరేషన్ ని ఆఫర్ చేసినట్లు సమాచారం. ఏదేమైనాప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా నటి కాజోల్ కోట్ల రూపాయలు దమ్మునరేషన్ తీసుకుంటుందంటే మామూలు విషయం కాదని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆమధ్య నటి కాజోల్ హిందీలో త్రిబంగ అనే చిత్రంలో నీలి పాత్రలో నటించింది కాగా ఈ చిత్రం క్లాసికల్ డాన్స్ బ్యాక్ డ్రాప్ లో దొరకక్కగా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా ప్రస్తుతం నటి కాజోల్ సలాం వెంకీ అనే ఓ హిందీ చిత్రంలో కూడా కీలకపాత్రలో నటిస్తోంది.