Huma Qureshi : బాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన గ్యాంగ్స్ ఆఫ్ వాజిపూర్ వెబ్ సిరీస్ మంచి హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ వెబ్ సిరీస్ లో హీరోయిన్ పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నటువంటి బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ హ్యుమా ఖురేషి కి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. దీంతో అప్పటినుంచి నటి హ్యుమా ఖురేషి వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ బాగానే రాణిస్తోంది. ఈ క్రమంలో కేవలం బాలీవుడ్ కి మాత్రమే పరిమితం కాకుండా హాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ తదితర సినీ పరిశ్రమల్లో కూడా హీరోయిన్ గా నటించి తనకంటూ కొంతమంది అభిమానులను సంపాదించుకుంది.
అయితే ఈ మధ్యకాలంలో నటి హ్యుమా ఖురేషి సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఈ బ్యూటీ ఘాటుగా అందాలు ఆరబోస్తూ కుర్రకారు మతిపోగొడుతోంది. తాజాగా ఈ అమ్మడు క్లీవేజ్ షో చేస్తూ దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా నెటిజన్లు ఫిదా అయ్యారు. అంతేకాకుండా 35 ఏళ్ల వయసు పైబడినప్పటికీ నటి హ్యుమా ఖురేషి ఫిట్నెస్ బాగానే మెయింటైన్ చేస్తుందని అందుకే ఇప్పటికీ వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా నటి హ్యుమా ఖురేషి తమిళం, తెలుగు తదితర భాషల్లో విడుదలైన కాలా చిత్రం ద్వారా టాలీవుడ్ బాలీవుడ్ సినీ ప్రేక్షకులకి పరిచయమైంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు మరిన్ని తెలుగు అనువాద చిత్రాలలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తున్నట్లు సమాచారం. అలాగే బాలీవుడ్ లో దాదాపుగా 5కి పైగా చిత్రాలలో కీలక పాత్రలలో నటిస్తోంది.