Kalpika Ganesh : తెలుగులో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటించి బాగానే ఆకట్టుకున్న ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కల్పిక గణేష్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయల్సిన అవసరం లేదు. అయితే నటి కల్పిక గణేష్ సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించి కెరీర్ మొదలు పెట్టినప్పటికీ క్రమక్రమంగా హీరోయిన్ గా నటించే అవకశాలు కుడా దక్కించుకుని హీరోయిన్ గా నటించింది. కానీ దురుద్రుష్టవశాత్తు ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయయి. దీంతో నటి కల్పిక గణేష్ కి హీరోయిన్ గా గుర్తింపు లభించలేదు. దాంతో ఈ అమ్మడి హీరోయిన్ కలలపై నీళ్ళు చల్లినట్లు అయ్యింది.
అయితే ఈ మధ్య కాలంలో నటి కల్పిక గణేష్ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడూ తనకి సంబందించిన ఫోటోలు వీడియోలు వంటివి షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే వీటితోపాటూ సమాజంలో జరిగే కొన్ని సంఘటనల గురించి కూడా అప్పుడప్పుడూ స్పందిస్తూ ఉంటుంది.
అయితే తాజాగా కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో సినీ సెలబ్రేటీల పేర్లతో నకిలీ ఖాతాలను క్రియేట్ చేసి అసబ్యకరంగా వీరి ఫోటోలు వీడియోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తున్న విషయంపై స్పందించింది. ఇందులో బాగంగా కొందరు ఏకంగా తెలుగు ప్రముఖ హీరోయిన్ల ఫోటోలను తీసుకుని అసభ్యకరంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేసారు. దీంతో కల్పిక గణేష్ ఈ అసభ్యకర పోస్ట్ ను షేర్ చేస్తూ ఇలాంటివాళ్ళను కటినంగా శిక్షించాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తునట్లు తెలిపింది.
దీంతో తాజాగా ఓ నెటిజన్ నటి కల్పిక గణేష్ ఫోటోలను అసభ్యకరంగా చిత్రీ కరించి ట్విట్టర్ లో షేర్ చేసారు. దీంతో ఈ పోస్ట్ పై కుడా నటి కల్పిక గణేష్ ఫైర్ అయ్యింది. అలాగే ఇలాంటి ఖాతాలను బ్యాన్ చెయ్యాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య కాలంలో సోసిల మీడియా వినియోగం ఎక్కువగా ఉండటంతో కొందరు ఆకతాయిలు పాపులర్ కావడం కోసం ఇలాంటి అఘయిత్యాలకి పాల్పడుతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అలాగే ఇలాంటివి సోషల్ మీడియాలో చాలా ఉన్నాయని ఇప్పటికైనా కంటెంట్ విషయంలో పబ్లిష్ వ్సిహయంలో సోషల్ మీడియా యాజమాన్యం జాగ్రత్త వహించి అడ్డుకట్ట వెయ్యకపోతే భవిష్యత్తులో ఫోటోలు షేర్ చెయ్యాలంటే భయపడాల్సిన అవకశాలు లేకపోలేదు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి