Kalyan Dev: మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజని వివాహం చేసుకొని మెగా ఇంటికి అల్లుడయ్యాడు. అయితే చాలా కాలంగా కళ్యాణ్ దేవ్, శ్రీజ విడాకుల గురించి వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ విడాకుల వార్తలు గురించి ఇటు శ్రీజ అటు కళ్యాణ్ దేవ్ తో పాటు మెగా కుటుంబ సభ్యులకు కూడా ఎవరు స్పందించడం లేదు. అయితే వీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నట్లు అందరికీ స్పష్టం అయ్యింది. ఎందుకంటెఈ పోస్ట్ మెగా కుటుంబంలో జరిగే ఈవెంట్స్ లో కనిపించడం లేదు.
అంతేకాకుండా మెగా కుటుంబ సభ్యులు కళ్యాణ్ దేవ్ ని దూరం పెడుతున్నారు. ఇంతకాలం సినిమాల విషయంలో కళ్యాణ్ దేవ్ కి సపోర్ట్ చేసిన కుటుంబ సభ్యులు ఇప్పుడు అతని గురించి పట్టించుకోవడం లేదు. అయితే కళ్యాణ్ దేవ్ మాత్రం తన కూతురి గురించి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేస్తూ ఉంటాడు. శ్రీజ మొదటి భర్తతో ఒక కూతురికి జన్మనివ్వగా కళ్యాణ్ దేవ్ ని వివాహం చేసుకున్న తర్వాత మరొక కూతురికి జన్మనిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ కూతురు శ్రీజ తో ఉంటుంది. అందువల్ల తరచూ తన కూతురుని తలుచుకుంటూ కూతురి కోసం ఎమోషనల్ పోస్ట్ లు షేర్ చేస్తూ ఉంటాడు.
Kalyan Dev: తెలియాల్సింది కొండంత…
తాజాగా మరొకసారి కల్యాణ్ దేవ్ షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూస్తుంటే తన గురించి, శ్రీజ గురించి బయట జరుగుతున్న ప్రచారంపై కల్యాణ్ దేవ్ సెటైర్ వేసినట్లు ఉంది. ఈ క్రమంలో “కొంతమందిని చూస్తే జాలిపడాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది గోరంత మాత్రమే.. తెలియాల్సింది కొండంత ఉంది ” అని పోస్ట్ షేర్ చేశాడు. అంటే శ్రీజ,కళ్యాణ్ వ్యక్తిగత జీవితాల్లో ఉన్న సమస్యల గురించి బయట వ్యక్తులకు సరైన అవగాహన లేదని, వారి కొంతవరకే తెలుసు తెలియాల్సింది చాలా ఉందని అని అర్థం వచ్చేలా కళ్యాణ్ దేవ్ ఈ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం కల్యాణ్ దేవ్ షేర్ చేసిన ఈ పోస్ట్ తో వారి విడాకుల వార్తలు మరింత ఊపందుకున్నాయి.