Kalyan Ram:తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కొనసాగుతున్నారు. ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కళ్యాణ్ రామ్ త్వరలోనే డెవిల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇలా వరుస సినిమాలలో హీరోగా నటిస్తున్న మరో సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా కూడా ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ విధంగా కళ్యాణ్ రామ్ ఒకవైపు వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా సక్సెస్ సాధించగా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయన 2006వ సంవత్సరంలో స్వాతి అనే అమ్మాయిని వివాహం చేస్తున్నారు. ఈ దంపతులకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి సంతానం. ఇక స్వాతి వృత్తి పరంగా డాక్టర్ కావడం విశేషం. అయితే పెళ్లి తర్వాత వైద్య వృత్తికి దూరంగా ఉంటూ కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్నారు. స్వాతి సంపన్నుల కుటుంబం నుంచి నందమూరి కోడలుగా అడుగు పెట్టారు.
Kalyan Ram: హరికృష్ణ అడ్డుకున్నారా…
ఇకపోతే నందమూరి కళ్యాణ్ రామ్ స్వాతిని పెళ్లి చేసుకోవడానికి కంటే ముందుగానే ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట ఇలా ఆ హీరోయిన్ పై ఈయన ఆసక్తిగా ఉన్నారని తెలుసుకున్నటువంటి హరికృష్ణ ఈ విషయంలో తన కుమారుడికి బాగా బ్రెయిన్ వాష్ చేసి ఆ హీరోయిన్ తో పెళ్లి జరగకుండా అడ్డుకున్నారు. ఈ విధంగా హరికృష్ణ కళ్యాణ్ రామ్ అడ్డుకోవడంతో ఈయన పెద్దలు చూసిన స్వాతి అనే అమ్మాయినీ వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.