Kamal Hassan: ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ అంటే తెలియని వారంటూ ఉండరు. తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ, బెంగాలీ ఇలా అన్ని భాషల్లో ఆయన సినిమాల్లో నటించి సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందాడు. నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా, ప్లే బ్యాక్ సింగర్ గా, వ్యాఖ్యాతగా కూడా ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.
మొదటిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన కమలహాసన్ స్వాతిముత్యం సినిమా ద్వారా గొప్ప నటుడిగా పేరు పొందాడు. వందలకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు. నటనపరంగా కమల్ హాసన్ ను మించిన వాళ్లు ఇప్పటివరకు ఎవ్వరూ లేరంటే నమ్మండి. అయితే ఆయన వ్యక్తిగత విషయానికొస్తే కమల్ హాసన్ కు ఇద్దరు కుమార్తెలు.
మొదటి బిడ్డ ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్. శృతిహాసన్ కూడా ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లో టాప్ హీరోయిన్. అలాగే సింగర్ కూడా. ఇక రెండవ కుమార్తె అక్షర హసన్. ఆమె కూడా ఒక నటి. ఇదంతా పక్కన పెడితే కమల్ హాసన్.. ఎంత మంచి మనసు కలిగి ఉన్నవాడు అన్నది మనందరికీ తెలిసిందే.
కమల్ హాసన్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. రక్తదానం, నేత్రదానం లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. దీని కారణంగానే ఆయనకు లోకనాయకుడు అనే బిరుదు వచ్చింది. ఇదంతా పక్కన పెడితే.. మన లోక నాయకుడు కమల్ హాసన్ తీవ్ర అస్వస్థత కు గురయ్యారు. ఇక దీంతో ఆయన్ని చెన్నై పొరూరు రామచంద్ర ఆసుపత్రికి వెంటనే తరలించారు.
ఆయనకు జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఉండడంతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఇక కమల్ హాసన్ అభిమానులు ఆయన ఆరోగ్యం గురించి విన్న తర్వాత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంతకుముందు ఆయన కరోనా బారిన పడిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా పోస్ట్ కోవిడ్ లక్షణాలు అయి ఉంటాయని అందుకే ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది.
Kamal Hassan: నిన్నటి వరకు బాగున్న కమల్ హాసన్ ఆరోగ్యం కానీ నేడు ఈ పరిస్థితి..
అయితే నిన్ననే హైదరాబాద్ కు వచ్చిన ఆయన ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కే. విశ్వనాధ్ ని కలిసి తిరిగి సాయంత్రానికే చెన్నై వెళ్లిపోయారు. అంతలోనే ఆయన అనారోగ్యం ఇలా అయిపోవడం జరిగింది. ఇది తెలుసుకున్న అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అలాగే ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయన కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు.