Kamal Hassan – Upendra: మామూలుగా కొంతమంది ఫ్యాన్స్ తమ హీరోల విషయంలో చిన్న దాన్ని పెద్దగా చేసి చెబుతుంటారు. అందులో ఏమీ లేకున్నా కూడా ఉన్నట్లు క్రియేట్ చేసి బాగా హైలెట్ చేస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఇద్దరు స్టార్ హీరోల పరిస్థితి కూడా అలాగే మారింది. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. నిన్న ఉదయం కమల్ హాసన్ హాస్పిటల్లో చేరినట్లు.. ఆయన ఆరోగ్య పరిస్థితి బాలేదు అన్నట్లు బాగా వార్తలు వచ్చాయి
అయితే మరోవైపు ఉపేంద్ర కూడా అనారోగ్యానికి గురయ్యాడు అని.. ప్రస్తుతమైన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు అని వార్తలు వచ్చాయి. దీంతో ఇది నిజం అనుకొని తమ ఫ్యాన్స్ కొంతవరకు ఆందోళన చెందారు. కానీ వారిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. నిజానికి నిన్న కమల్ హాసన్ హాస్పిటల్ కి వెళ్లిన సంగతి నిజమే. కానీ కారణం ఏంటంటే ఆయనకు కొద్దిపాటి జ్వరంతో పాటు దగ్గు, జలుబు ఉండటం వల్ల హాస్పిటల్ కి వెళ్ళాడు.
దీంతో ఆయన చూయించుకున్న శ్రీరామచంద్ర హాస్పిటల్ వైద్యులు ఆయనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని ప్రకటించారు. మరో రెండు రోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేస్తామని కూడా తెలిపారు. ఉపేంద్ర విషయానికి వస్తే ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. అంతేకాకుండా ఆయన తన సోషల్ మీడియా వేదికగా ఒక సెల్ఫీ వీడియో పోస్ట్ చేస్తూ.. తను ఆరోగ్యంగానే ఉన్నాను అంటూ షూటింగ్లో ఉన్నాను అని అన్నాడు.
Kamal Hassan – Upendra: తన హెల్త్ గురించి క్లారిటీ ఇచ్చిన ఉపేంద్ర..
షూటింగ్లో వచ్చే పొగ, డస్ట్ వల్ల జలుబు, దగ్గు లాంటివి వచ్చాయని కానీ అదంతా అస్వస్థత కాదంటూ తెలిపాడు. ఇక అనారోగ్యానికి గురయ్యాను అంటూ వస్తున్నా వదంతులను అసలు నమ్మకూడదు అని అవన్నీ పుకార్లు అని కొట్టి పారేశాడు. ఇక ఈ విషయాలు తెలుసుకున్న తమ ఫ్యాన్స్.. తమ అభిమానుల హీరోల గురించి తప్పుడు ప్రచారాలు చేసినందుకు ఆ వెబ్సైట్లపై బాగా ఫైర్ అవుతున్నారు.