Kamalinee Mukherjee: ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన నటి కమిలిని ముఖర్జీ. అయితే కమిలిని ముఖర్జీ అనే పేరు కంటే ఆనంద్ సినిమాలోని హీరోయిన్ అంటే ఎవ్వరైనా గుర్తుపడతారు. ఎందుకంటే ఈ సినిమాతోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టడమే కాకుండా ఈ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది కమిలిని.
అలా 2004లో ఆనంద్ సినిమాతో అడుగుపెట్టగా ఆ తర్వాత వరుసగా మీనాక్షి, గోదావరి, స్టైల్, హ్యాపీ డేస్, పెళ్లయింది కానీ, గమ్యం, గోపి గోపిక గోదావరి ఇలా పలు సినిమాలలో నటించి చాలావరకు మంచి పేరు సంపాదించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళం, హిందీ భాషలో కూడా నటించింది కమిలిని. అయితే చివరిగా గోవిందుడు అందరివాడేలే సినిమాల్లో నటించగా మళ్లీ అప్పటినుంచి ఇప్పటివరకు టాలీవుడ్ వైపు చూడనే లేదు ఈ బ్యూటీ.
ఇక చూడటానికి చాలా అందంగా ఉండటంతోఎంతోమంది కుర్రాళ్లను తన వైపుకు మలుపుకుంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ ఎక్కడ ఉంది.. అసలేమయ్యింది.. ఎలా ఉంది అనే విషయం అందరూ మర్చిపోయారు. కొత్త హీరోయిన్ లు రావటంతో ఈ పాత హీరోయిన్ల గురించి చూసే అవకాశం కూడా లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం కమిలిని సినిమాలకు దూరంగా ఉంటూ అమెరికాలో స్థిరపడి అక్కడే వ్యాపారాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఇంత కాలానికి బ్యూటీ అందరి కంటిలో పడింది.
Kamalinee Mukherjee:
తాజాగా డల్లాస్ లో జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొని అక్కడ సందడి చేసింది కమిలిని. దీంతో ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వటంతో అందులో కమిలిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కమిలిని ఏంటి ఇలా మారిపోయింది.. అసలు ఇంత లావుగా అయ్యిందేంటి.. అంటూ ఆశ్చర్యపోతున్నారు తెలుగు ఫ్యాన్స్. మొత్తానికి కమిలిని ఇంత లావుగా అవటంతో తనకు ఏదైనా సమస్య వచ్చిందేమో అని అనుకుంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఆమె లుక్ బాగా వైరల్ అవుతుంది.