Kangana Ranaut: అలాంటి వార్తల వల్లే నాకింకా పెళ్లి కావడం లేదు.. పాపం కంగానా రానౌత్!

Akashavani

Kangana Ranaut: బాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి అందరికీ తెలిసిందే. నటిగా కంటే వ్యక్తిగత విషయం లోనే బాగా హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన నటనకు ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ముక్కుసూటి నటిగా నిలిచి ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకుంది.

2004లో ఐ లవ్ యు బాస్ అనే సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది కంగనా రనౌత్. ఇక ఈ సినిమాలో తన తొలి నటనతోనే మంచి సక్సెస్ అందుకుంది. అలా ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకొని ఓ రేంజ్ లో దూసుకెళ్లింది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ సినిమాలో కూడా నటించింది.

ఇక కంగనా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. నిత్యం ఏదో ఒక విషయం తో బాగా హాట్ టాపిక్ గా నిలుస్తుంది. తన నోటికి వచ్చిన మాటలతో అందరిని వణికిస్తుంది. ఇక ఇదంతా పక్కన పెడితే.. ప్రస్తుతం ఈమె రజనీష్ ఘాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధాకడ్ సినిమాల్లో నటించింది.

ఈ సినిమా గూడచారి తరహా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. ఇందులో కంగనా భారీ యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా మే 20న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ భాగంలో కంగనా బాగా బిజీగా ఉంది. దీంతో తాజాగా తనకు ఒక ఇంటర్వ్యూలో.. నిజజీవితంలో కూడా మీది ధాకడ్ క్యారెక్టర్ ఏనా అనే ప్రశ్న ఎదురయింది.

Kangana Ranaut: అలాంటి వార్తల వల్లే నాకింకా పెళ్లి కావడం లేదు.. పాపం కంగానా రానౌత్!
Kangana Ranaut: అలాంటి వార్తల వల్లే నాకింకా పెళ్లి కావడం లేదు.. పాపం కంగానా రానౌత్!

Kangana Ranaut: తనకు ఇంకా పెళ్లి కాకపోవడానికి కారణం ఇదే..

వెంటనే ఆమె నవ్వుతూ.. నిజజీవితంలో ఎవరినైనా అలా కొడితే ఊరుకుంటారా.. అసలైన నేను ఎందుకు కొడతాను.. మీ లాంటి వాళ్లు ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయటం వల్లే నాకింకా పెళ్లి కావట్లేదు అంటూ ఫన్నీ గా స్పందించింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

- Advertisement -