Kangana Ranaut: బాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి అందరికీ తెలిసిందే. నటిగా కంటే వ్యక్తిగత విషయం లోనే బాగా హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన నటనకు ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ముక్కుసూటి నటిగా నిలిచి ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకుంది.
2004లో ఐ లవ్ యు బాస్ అనే సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది కంగనా రనౌత్. ఇక ఈ సినిమాలో తన తొలి నటనతోనే మంచి సక్సెస్ అందుకుంది. అలా ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకొని ఓ రేంజ్ లో దూసుకెళ్లింది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ సినిమాలో కూడా నటించింది.
ఇక కంగనా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. నిత్యం ఏదో ఒక విషయం తో బాగా హాట్ టాపిక్ గా నిలుస్తుంది. తన నోటికి వచ్చిన మాటలతో అందరిని వణికిస్తుంది. ఇక ఇదంతా పక్కన పెడితే.. కంగనాకు ఇప్పటికి కూడా పెళ్లి కాలేదన్న సంగతి తెలిసిందే.
ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. రాబోయే ఐదేళ్లలో ఎలా కనిపించబోతున్నారు అని యాంకర్ ప్రశ్నించడంతో.. ఆ ఐదేళ్లలో తాను తల్లిగా చూడాలనుకుంటున్నానని.. తనకు త్వరగా పిల్లలను కనాలని ఉందని తెలిపింది. ఇక తన జీవితంలో ఎవరైనా స్పెషల్ పర్సన్ ఉన్నారా అని ప్రశ్నించడంతో.. త్వరలోనే మీకు పరిచయం చేస్తాను అని తెలిపింది.
Kangana Ranaut: తాను ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఈ వ్యక్తినే..
ఇక ఈమె కెరీర్ మొదట్లో మరో నటుడు ఆదిత్య పంచోలితో లవ్ లో ఉండగా.. అతడికి పెళ్లయి పిల్లలు ఉండటం వల్ల కంగనా అతనిని వదిలేసింది. దీంతో ఆ కారణం వల్లే తను ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉందని తెలిసింది. ప్రస్తుతం కంగనా వరుస సినిమాలతో బిజీగా ఉంది.