Karan Johar : బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతగా పేరు తెచ్చుకున్న కరణ్ జోహార్.. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. నిర్మాతగానే కాకుండా టాప్ డిస్ట్రిబ్యూటర్‌గా కూడా ఆయనకు పేరు ఉంది. అలాగే కరణ్ జోహార్ వివాదాలతో కూడా ఎక్కువగా వార్తల్లో ఉంటూ ఉంటారు. నెపోటిజం విషయంకి సంబంధించి ఆయనపై అనేక విమర్శలు వచ్చాయి. కొంతమందికి సపోర్ట్ గా ఆయన నిలుస్తున్నారని, స్టార్ కిడ్స్ తోనే సినిమాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ మరణం విషయంలో కరణ్ జోహర్‌పై అనేక విమర్శలు వచ్చాయి. కొత్త హీరోలకు సినిమాలు రాకుండా చేస్తున్నారనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి. అయితే తాజాగా కరణ్ జోహర్ స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ హీరోలు దేనికి పనికిరారని, రెమ్యూనరేషన్ ఎక్కువగా డిమాండ్ చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ సంచలన కామెంట్స్ చేశాడు. నిర్మాతగా తన జీవితంలో ఇప్పటివరకు ఎంతోమంది హీరోలను నమ్మి మోసపోయానని, కష్టాలను ఎదుర్కొని తట్టుకునే శక్తి తనకు ఉండి కాబట్టే ఇంకా ఇండస్ట్రీలో ఉన్నానని చెప్పాడు. రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ కూడ రాబట్టలేని హీరోలు ఒక్కో సినిమాకు రూ.30 నుంచి రూ.40 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.
Karan Johar :
బాలీవుడ్ సినిమాలతో పోలిస్తే టాలీవుడ్ సినిమాలు బాగా బిజినెస్ చేస్తున్నాయని కరణ్ జోహార్ తెలిపాడు. భారీ బడ్జెట్ సినిమాల్లో సగం డబ్బులు హీరో రెమ్యూనరేషన్ కే సరిపోతున్నాయని, స్టార్ హీరోలు తమ వాల్యూ తెలుసుకోకుండా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం అవసరమా అంటూ ప్రశ్నించాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో దుమారం రేపుతోన్నాయి. ఆయన ఎవరి హీరోలను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశాడానే చర్చ జరుగుతోంది.