Karan Johar: ఎలాంటి సెలబ్రిటీ అయినా కొన్ని సందర్భాలలో అభిమానుల మనోభావాలే దెబ్బతింటే పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం. కొన్ని సార్లు అల్లరి మూకలు తయారై ఎలాంటి ప్రమాదాన్నైనా తలపెడతారు. ఇప్పుడు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్, హోస్ట్ కరణ్ జోహార్ గురించి ఇలాంటి కామెంట్సే వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఆయన నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో ఎక్కువగా అడల్ట్ కంటెంట్ ఉండటమే.
ఇప్పటికే 6 సీజన్స్ కంప్లీట్ అయినా ఈ టాక్ షో ప్రస్తుతం 7వ సీజన్ కొనసాగుతోంది. అయితే, ఈ సీజన్‌లో ఇప్పటికే సమంత, విజయ్ దేవరకొండ అనిల్ కపూర్, అక్షయ్ కుమార్, సారా అలీఖాన్, ఆలియా భట్, ఆలియా భట్, రణ్వీర్ సింగ్, తాజాగా కియారా అద్వానీ, షాహిద్ కపూర్ పాల్గొన్నారు. అయితే, ఎవరు వచ్చినా కరణ్ వారిని సెక్స్ కి సంబంధించిన ప్రశ్నలను తప్పకుండా అడుగుతున్నాడు. పనిలో పనిగా తనకు ఎలాంటి సెక్స్ ఇష్టమో ఓపెన్ అవుతున్నాడు.
Karan Johar: పిచ్చి ప్రశ్నలను అడగడం మాస్తేరామో చూడాలి.
ఇదే కరణ్‌ని ఇప్పుడు ఘోరంగా రోల్ చేసేందుకు అవకాశం అయింది. నెటిజన్స్ కొందరు కరణ్‌పై మండిపడుతున్నారు. వచ్చిన ప్రతీ గెస్ట్‌ని ఇలా సెక్స్ గురించి అడగడం ఏంటీ అని ఫైర్ అవుతున్నారు. ఇదే దరిద్రమైన ప్రశ్నలు అని ఏకిపారేస్తున్నారు. మరికొందరు చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. ఇదే ఫైర్‌లో ఉన్నప్పుడు జనాల ముందుకు వస్తే ఖచ్చితంగా కరణ్‌కి మూడినట్టే అనిపిస్తోంది. మరి ఈ ట్రోల్స్, మండిపాటు చూసి ఇప్పటి నుంచైనా ఇలాంటి పిచ్చి ప్రశ్నలను అడగడం మాస్తేరామో చూడాలి.