Sravana Bhargavi: సింగర్ శ్రావణ భార్గవి తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్న విషయం మనకు తెలిసిందే. ఈమె అన్నమయ్య కీర్తనలలో ఒకటైన ఒక పరీ అనే కీర్తనను పాడటమే కాకుండా ఈ పాటలో తాను నటించడం పెద్ద వివాదంగా మారింది. ఈ పాటలో తాను ఎంతో అభ్యంతరకరంగా నటించింది అంటూ చాలామంది ఈ వీడియో పై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ వీడియోలో శ్రావణ భార్గవి కాళ్లు ఊపుతూ, జంతికలు తింటూ ఎంతో శృంగారభరితంగా ఈ వీడియో చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
ఈ వీడియో పై ఎంతోమంది స్పందిస్తూ శ్రావణ భార్గవి వీడియో పట్ల విమర్శలు కురిపించారు.అయితే శ్రావణ భార్గవి ఈ విషయంపై స్పందిస్తూ తాను ఎలాంటి తప్పు చేయలేదని ఈ వీడియోని డిలీట్ చేసే ప్రసక్తే లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఎంతోమంది ఇప్పటికే అన్నమయ్య కీర్తనలకు ఎన్నో వీడియోలు చేశారు అయితే తాను ఈ వీడియోలో ఏ విధమైనటువంటి అసభ్యకరంగా నటించలేదని తాను ఈ వీడియో డిలీట్ చేయనని తేల్చి చెప్పారు. ఇకపోతే ఈ వీడియో పై అన్నమయ్య వంశీకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.శ్రావణ భార్గవి ఈ వీడియో డిలీట్ చేయకపోతే తాము చట్టపరంగా ముందుకు వెళ్తామని తనకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Sravana Bhargavi: ఇలాంటి చర్యల పై ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు…
ఇదిలా ఉండగా తాజాగా ఈ వివాదం పై కరాటే కళ్యాణి స్పందించారు.ఈమె ఈ విషయంపై మాట్లాడుతూ హిందూ ధర్మం ప్రకారం పెళ్లి అయిన మహిళ బొట్టు మెడలో తాళి కాలికి మెట్టెలు పెట్టుకొని ఉండాలి.కానీ శ్రావణ భార్గవి అవి ధరించలేదు ఆమె ఎందుకు పెట్టుకోలేదు నాకు అర్థం కావడం లేదు కానీ ఆమె అన్నమయ్య కీర్తనలను కాళ్లు ఊపుతూ చేయడం చాలా తప్పు. ఒకప్పుడు కొందరు దర్శకులు సినిమాలలో ఈ పాటలు పెట్టారంటే అప్పుడు ప్రశ్నించే వాళ్ళు లేరు అయితే ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళు ఉన్నారని ఆ వీడియోని డిలీట్ చేయకపోయినా అందులో కొన్ని సన్నివేశాలను తొలగించాలి అంటూ కరాటే కళ్యాణి తెలిపారు.ఈ వీడియోని తొలగించకపోతే భవిష్యత్తులో తాను చాలా బాధపడాల్సి వస్తుందంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.