Karate Kalyani: తెలుగు సినీ నటి, బిగ్ బాస్ ఫేమ్ కరాటే కళ్యాణి గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈమె సినిమాలలో ఎన్నో బోల్డ్ పాత్రలలో నటించింది. ఇక బయట కూడా ఈమె ఎంతో బోల్డ్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత కాలం తన మాటలతో బాగా రెచ్చిపోయింది. తన నోటికి వచ్చినట్లు బాగా ఫైర్ అవుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో విషయంలో బాగా సీరియస్ అయింది.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. యూట్యూబ్ ప్రేక్షకులకు శ్రీకాంత్ రెడ్డి అనే పేరు పరిచయం ఉండే ఉంటుంది. ఇతడు గత కొంత కాలం నుంచి సోషల్ మీడియాలో అమ్మాయిలతో, ఆంటీలతో వల్గర్ గా మాట్లాడటమే కాకుండా.. వారితో కామకోరికలు రగిల్చేలా మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు.
దీంతో తాజాగా కరాటే కళ్యాణి.. ఈ ప్రాంక్ వీడియో లో ఇతడు మాట్లాడే మాటలు మహిళల్ని, హిందువులను అగౌరవపరిచేలా ఉండటంతో ఏకంగా అతన్ని ఇంటికి వెళ్లి అతడిని బాగా చితక్కొట్టింది. నువ్వు తీస్తున్న ఫ్రాంక్ వీడియోలు ఏంటి.. సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అతడిని కొట్టగా అతడు మళ్ళీ తిరగబడ్డాడు.
దీంతో కరాటే కళ్యాణి చంప పగిలేలా గట్టిగా కొట్టాడు శ్రీకాంత్ రెడ్డి. ఇక అతడు వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలి కానీ నన్ను ఎందుకు కొడుతున్నావు అని గట్టిగా హెచ్చరించాడు. దాంతో తనతో వీడియో తీసుకోవడానికి డబ్బులు అడిగింది అని.. అవి ఇవ్వకపోవటంతో ఇలా చేసింది అంటూ అతడు ఆరోపణలు చేశాడు.

Karate Kalyani: అక్కడ చెయ్యి పెట్టాడు అంటూ ఫైర్ అయిన కరాటే కళ్యాణి..
ఇక కరాటే కళ్యాణి కూడా మాట్లాడుతూ.. అతడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అని.. పైగా తన పక్కలో పడుకోవాలని అడిగాడని.. తన బొడ్డు పై చేయి పెట్టాడు అని.. అందుకే చెంప పగలగొట్టానని వివరించింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.