Kareena Kapoor : ఈ రోజుల్లో నెటిజన్లకు సోషల్ మీడియా ద్వారా ఎక్కడి లేని స్వేచ్ఛ లభించింది.. కొందరు ఈ వేదికని తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి ఉపయోగిస్తే.. మరికొందరేమో సెలబ్రెటీలను కించపరచడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మేరకు తమకు నచ్చని పని ఎవరైనా నటీనటుల చేస్తే ట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ బాలీవుడ్ అమ్మడు ఎప్పుడు ట్రెండ్ నీ ఫాలో అవుతూ.. వైవిధ్యమైన డ్రెస్సులను ధరిస్తూ ఉంటుంది.
అయితే తాజాగా ఈసారి కరీనా ఓ బ్లాక్ కలర్ మెష్ టాప్‌లో మెరిసింది. ఇటీవల తన భర్త సైఫ్ అలీఖాన్ తో కలిసి బయటకి వచ్చిన కరీనా ఆ డ్రెస్ తో మీడియాకి చిక్కింది. కింద ప్యాంటు లాంటిది వేసి, పైన నెక్ లెస్ ఓపెన్ టాప్ వేసింది.. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. కొందరేమో “కరీనా..ఏంటి నైటీతో బయటకి వచ్చావు’ అని, మరికొందరేమో ‘ఈ డబ్బున్న వారికి మంచి బట్టలు ఉండవు. ఇలా నైటీలు వేసుకొస్తారు’ అంటూ సెటైర్లు వేస్తున్నారు
‘ఇంట్లో నైటీలు వేసుకోవట్లేదా ఇలా బయటకు నైటీలు వేసుకొచ్చావు’ అన్ని కొందరు నెటిజన్లు కరీనా కపూర్ ని ట్రోల్ చేస్తున్నారు. బాలీవుడ్లో ఈమెకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని తరచూ నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ వాటిపై ఎప్పుడు కరీనా స్పందించలేదు. మరి తాజాగా నైటీ పై నెటిజన్లు చేస్తున్న ట్రోల్ పై కరీనా కపూర్ స్పందిస్తుందో లేదో చూడాలి మరి.
ఇక సినిమాల విషయానికొస్తే కరీనా కపూర్ ప్రస్తుతం అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తుంది.